మోదీ, గవర్నర్, రాష్ట్రపతి దగ్గరకు వెళ్లినా పర్వాలేదు, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే ?, డీకే !
బెంగళూరు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. ఇప్పటికే ప్రభుత్వంపైనా, మంత్రులపైనా పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై కొందరు కాంట్రాక్టర్లు కమిషన్ ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై డీసీఎం డీకే శివకుమార్ నోరు విప్పారు. బకాయి బిల్లులు చెల్లించేందుకు తాను డబ్బులు డిమాండ్ చేశారన్న కాంట్రాక్టర్ల ఆరోపణపై డీకే శివకుమార్ మండిపడ్డారు.
మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంట్రాక్టర్ల బిల్లుల గురించి తనకు తెలియదన్నారు. ఎవరికీ సమాధానం చెప్పనవసరం తనకు లేదని, నేను కూడా స్పృహలో ఉన్నానని, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని, నాకు రాజకీయాలు కూడా తెలుసని, ఏ కాంట్రాక్టర్ వెనుక ఎవరున్నారో కూడా తనకు బాగా తెలుసునని డీకే శివకుమార్ ఆయన స్టైల్లో సమాధానం ఇచ్చారు.

నా ముందు ఎలాంటి బ్లాక్‌మెయిల్ ప్రయోగాలు పనికిరావని, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చారా? అనేది చూస్తున్నామని, నేను ఎవరితోనూ ప్రమాణం చేయాల్సిన అవసరం లేదని డీకే శివకుమార్ అన్నారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదలవుతాయి, లేకపోతే బిల్లులు విడుదల కావని, గతంలో ఎవరి మీదో బ్లాక్ మెయిల్ చేసినట్టు ఇప్పుడు వచ్చి నాపై అలాంటి బ్లాక్ మెయిల్ ప్రయోగాలు చేస్తే కుదరవని డీకే శివకుమార్ ఘాటుగా బదులిచ్చారు.
ఇంకా వారం రోజుల్లో డబ్బులు విడుదల అవుతాయి, ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఎవరైనా తనను బ్లాక్‌మెయిల్ చేసేలా ప్రయత్నాలు చేసినా ఆ ట్రిక్కులు పని చెయ్యవని, నన్ను బెదిరించాలనే ప్రయత్నాలు మానుకోవాలని డీకే శివకుమార్ ఆయన మీద రాజకీయాలు చెయ్యాలని అనుకునే వాళ్లకు గట్టిగా సమాధానం ఇచ్చారు.
ఎమ్మెల్యేల భేటీపై మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ బదులిస్తూ బెంగళూరు ఎమ్మెల్యేలు అందరూ బుధవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలుస్తారని చెప్పారు. గతంలో జరిగిన వివక్షపై చర్చిస్తామని, ఇంకా నియోజక వర్గాల సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామని డీకే. శివకుమార్ చెప్పారు. ఇలా తన మీద ఆరోపణలు చేస్తున్న వారు ఎవరో కూడా తనకు బాగా తెలుసని డీకే. శివకుమార్ అన్నారు.

వారు కోరుకున్నది వాళ్లను చేయనివ్వండి. చట్ట ప్రకారం మేము పని చేస్తున్నాం. ఇలాంటి బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌లకు నేను తలవంచను, గవర్నర్‌కు లేఖ ఇవ్వండి, రాష్ట్రపతికి లేఖ ఇవ్వండి, ప్రధానమంత్రిని కలిసినా పర్వాలేదని, వాళ్లు ఏది కావాలంటే అది చేయ్యమనండి అని డీకే శివకుమార్ ఆయన మీద ఆరోపణలు చేస్తున్న వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి నాలో ఉంది, ఇలాంటి కాంట్రాక్టర్ సమస్యలన్నింటిపై నేను స్పందించబోనని డీకే శివకుమార్ అన్నారు.
గతంలో కాంట్రాక్టర్లు బీజేపీని దూషించారని, ఇప్పుడు మీపై ఆరోపణలు చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ సమాధానం ఇచ్చారు. కాంట్రాక్టర్లు కూడా నా వద్దకు వచ్చి పనులు చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారని, బిల్లు ఇచ్చే ప్రక్రియ ఉందన్నారు. రెండు మూడేళ్లుగా కొందరు కాంట్రాక్టర్లు ఎదురు చూడలేదా అని డీకే శివకుమార్ ప్రశ్నించారు.
జలవనరుల శాఖ వద్ద రూ. 600 కోట్ల నిధులు ఉన్నాయని, అయితే రూ. 25 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకు వచ్చి వారికి చెల్లిస్తారు చెప్పండి, పని పూర్తి చేయ్యని వారందరికీ బిల్లులు చెల్లించడం సాధ్యమవుతుందా? అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ప్రశ్నించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications