చంద్రబాబు, విజయ్ ను అధిగమించిన డీకే శివకుమార్ - దేశంలోనే నెంబర్ ఒన్..!!
కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొత్త రికార్డు నెలకొల్పారు. సీఎం పీఠం దక్కించు కొంటూనే ఈ అరుదైన ఘనత దక్కించుకున్నారు. చంద్రబాబు.. విజయ్ ను అధిగమించారు. దేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కంటే నెంబర్ ఒన్ స్థానంలో నిలిచారు. 2023 ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా డీకే శివకుమార్ ఆస్తుల వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ లెక్కన అందరి కంటే డీకే ఇప్పుడు రిచెస్ట్ సీఎంగా రికార్డులకు ఎక్కారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూనే... డీకే శివకుమార్ కొత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకు దేశంలో ధనిక సీఎంగా ఉన్న చంద్రబాబును అధిగమించారు. ఆయన రికార్డు ను పక్కకు నెట్టి.. తన సొంతం చేసుకున్నారు. కాగా, డీకేతో పాటుగా టాప్ త్రీ ధనవంతులైన ముఖ్యమంత్రులు అంతా దక్షిణాది రాష్ట్రాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2023 లో జరిగిన కర్ణాటక ఎన్నికల సమయంలో డీకే తన అఫిడవిట్ లో సమర్పించిన ఆస్తుల వివరాలు చూస్తే మొత్తం వాటి విలువ 1413 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. ఇందులో . వాణిజ్య ఆస్తులు, వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, పెట్టుబడులు, షేర్లు సహా బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. అదే విధంగా బంగారంతో పాటు ఇతర ఆస్తులు కూడా ఉన్నాయి. కాగా.. 2008 లో తన ఆస్తి రూ 75 కోట్లుగా చూపించారు. ఇప్పుడు ఈ స్థాయికి చేరాయి.

దేశంలోనే ధనిక సీఎంగా... జాబితాలో
ఇక, డీకే శివకుమార్ తరువాతి స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 931 కోట్ల రూపాయలు. మూడవ ప్లేస్ లో తమిళనాడు సీఎం అయిన జోసెఫ్ సి విజయ్ ఉన్నారు. ఆయన కుటుంబం ఆస్తుల విలువ 648 కోట్ల రూపాయలుగా ఉంది. విజయ్ కి సినిమా రంగం ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు ఇతర స్థిరాస్తుల పెరుగుదల కూడా కారణంగా చెబుతున్నారు. జాబితాలో నాలుగో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ 332 కోట్ల రూపాయలుగా ఉంది. ఈయన గత పదేళ్ళుగా అరుణాచల ప్రదేశ్ సీఎం గా ఉన్నారు. అయిదవ ప్లేస్ లో నాగాలాండ్ కి చెందిన ముఖ్యమంత్రి నెయిఫియు రియో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 46 కోట్లుగా ఉంది. ఇక ఆ తరువాత ఆరవ స్థానంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ 42 కోట్లతో ఉంటే పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి 38 కోట్లతో ఏడవ స్థానంలో ఉన్నారు తెలంగాణా సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి 30 కోట్ల రూపాయల ఆస్తులతో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఈ లెక్కలు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కరంగా మారాయి.













Click it and Unblock the Notifications