సీఎంకు షాక్, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో నాకు తెలుసు, హైదరాబాద్ లో !

బెంగళూరు: ముగ్గురు డీసీఎంలు కావాలంటూ మంత్రి కేఎన్ రాజన్న చేసిన ప్రకటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తనను డీసీఎం పదవిలో నియమించారన్నారని డీకే శివకుమార్ అన్నారు. అయితే ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు కావాలని చెప్పిన మంత్రి రాజన్న దీనికి ఆయనే సమాధానం చెబుతారని డీకే శివరుమార్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

మంత్రి రాజన్న ఎందుకు ఇలాంటి ప్రకటన చేశారో తనకు తెలియదని, ముఖ్యమంత్రి కింద పని చేసే వారు తన మాట వినాలని మేము అనుకుంటున్నామని డీకే శివకుమార్ పరోక్షంగా సిద్దరామయ్య వర్గానికి ఝలక్ ఇచ్చారు. బెంగళూరు నగరంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడారు.

DK Shivakumar

ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హైకమాండ్ కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్నను వివరణ అడుగుతామన్నారని, బీకే హరిప్రసాద్‌కు హైకమాండ్ లేఖ రాసిందని, నేను సమాధానం చెప్పాల్సిన వారికి మాత్రమే సమాధానం ఇస్తానని, తనకు ఏదైనా సమాధానం కావాలంటే ఎవరిని అడగాలో వారినే అడుగుతానని, మత్రి రాజన్న మాటలతో తనకేమీ ఇబ్బంది లేదు అని డీకే శివకుమార్ మీడియా ప్రశ్నలకు బదులిచ్చారు.

కాంగ్రెస్ హైకమాండ్ కేవలం ఒక్క డీసీఎం పదవి మాత్రమే అని చెప్పిన తర్వాత కూడా ఇలాంటి ప్రచారం ఎందుకు అని మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శికుమార్ బదులిస్తూ నేను రెండు రోజులు హైదరాబాద్‌లో ఏఐసీసీ మీటింగ్‌లో ఉన్నాను, ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ పలువురు నేతలు ఆ సమావేశంలో పాల్గొన్నారు, ఇప్పుడు తాను ఈ వియం తెలిసిందని, పూర్తి సమాచారం తెలుసుకుని మాట్లాడుతానని డీకే శివకుమార్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ విషయంలో డీకే శివకుమార్ వర్గం మౌనంగా ఉండడం వల్లే డీసీఎం పదవుల వివాదం తలెత్తిందని మీడియా అడిగిన ప్రశ్నలకు డీకే శివకుమార్ బదులిచ్చారు నా రాజకీయ జీవితంలో ఏ వర్గానికి తాను మద్దతు ఇవ్వలేదని, నాకు ముఠా రాజకీయాలు అవసరం లేదని, బంగారప్ప హయాంలో, ఎస్.ఎం.కృష్ణ హయాంలో తాను వర్గ రాజకీయాలు చేసేవాడినని, అయితే తనకు వర్గాలు అవసరం లేదని, నాది కాంగ్రెస్ వర్గం అని, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదని డీకే శివకుమార్ మీడియా మీద అసహనం వ్యక్తం చేశారు.

 CM in the matter of three DMC posts

లింగాయత్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు డీసీఎం పదవులు ఇవ్వాలని ఇటీవల కర్ణాటక మంత్రి రాజన్న హైకమాండ్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు. లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ముగ్గురికి ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని, లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలంటే మరో ముగ్గురికి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందని ఇటీవల కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న వివాదాస్పద వ్యాక్యలు చెయ్యడంతో కాంగ్రెస్ లో వర్గ పోరు మొదలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+