రైతులకు, ప్రజలకు సినిమా కష్టాలు, కరెంట్ కోతలపై డీకే వేదాంతం, కరువును ఆపలేరు !
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో విద్యుత్ (power) కొరతపై అధికార పార్టీ కాంగ్రెస్‌పై (congress) ప్రతిపక్ష పార్టీ బీజేపీ విరుచుకుపడుతున్నది. బీజేపీ విమర్శలప కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ధీటుగా స్పందించారు. కర్ణాటక రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనడంతో కరెంటు కొరత ఉందనే విషయం బీజేపీ నాయకుల కళ్లకు కనపడటం లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (dk shivakumar) మండిపడ్డారు.
కరెంటు కోతల విషయాన్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలు వారి హయాంలో ఎంత విద్యుత్ (power) ఉత్పత్తిని పెంచారో చెప్పాలని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ బీజేపీ( BJP) నాయకులను నిలదీశారు. గురువారం బెంగళూరులోని కేపీసీసీ (congress) కార్యాలయంలో డీసీఎం డీకే శివకుమార్ (dk shivakumar)మీడియాతో మాట్లాడారు. వర్షాలు కురిస్తే కరెంట్ ఇబ్బందులు ఉండేవి కాదని డీకే శివకుమార్ అన్నారు.

కర్ణాటకలో (karnataka)వర్షపాతం తక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉందని డీకే శివకుమార్ అన్నారు. అప్పుడు 10,000 నుంచి 13,000 మెగావాట్ల విద్యుత్ (power)ఉత్పత్తిని పెంచామని, గత నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని ఏమాత్రం పెంచలేదని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని డీకే శివకుమార్ (dk shivakumar)బీజేపీ మీద నిందలు వేశారు.
కర్ణాటక (karnataka) రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొందని, రాష్ట్రంలోని డ్యామ్‌లలో నీటి లభ్యత తక్కువగా ఉందని. కరువు ఏర్పడినప్పుడు విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుందని. అలాగే, ప్రతి సంవత్సరం డిమాండ్ 10 నుండి 15 శాతం పెరుగుతుందని, 10,000 ఎకరాల్లో సోలార్ పవర్, పవన విద్యుత్ (power) ఉత్పత్తికి మా ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని సిద్ధం చేస్తోందని డీసీఎం డీకే శివకుమార్ (dk shivakumar)చెప్పారు.
రైతుల నుంచి విద్యుత్ (power) డిమాండ్ కూడా పెరిగిందరని, రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా చూస్తామని, మా మంత్రులు ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్నారని, సమస్యను పరిష్కరిస్తామన డీకే శివకుమార్ అన్నారు. ఇంధన (power) శాఖ మంత్రి కేజే జార్జ్ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో చర్చించి సెంట్రల్ గ్రిడ్‌ల నుంచి విద్యుత్ సరఫరా చేయాలని అభ్యర్థించారని డీకే శివకుమార్ (dk shivakumar) అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలకు చెందిన పవర్ ఫుల్ లీడర్ల చేరిక కార్యక్రమానికి ముందు కేపీసీసీ (KPCC) కార్యాలయం దగ్గర మీడియా అడిగిన ప్రశ్నలకు డీకే శివకుమార్ (dk shivakumar)స్పందిస్తూ కావేరీ జలాల పంపిణీకి సంబంధించి కావేరీ జలాల నియంత్రణ కమిటీ ముందు అప్పీల్ చేస్తామని, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా బిలిగుండ్లుకు ప్రవహించే నీరు స్వల్పంగా తగ్గిపోయిందని డీకే శివకుమార్ అన్నారు. డీకే శివకుమార్ తెలంగాణ (Telangana) ఎన్నికల ప్రచారానికి వెళ్లకముందే కాంగ్రెస్ పార్టీలో చేరిపోవాలని ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతున్నారు.
రెండు మూడు రోజులు మాత్రమే వర్షాలు కురిశాయని, 200 పైగా తాలూకాలలో కరువు పరిస్థితులు ఉన్నాయని, మేము ఇబ్బందులు పడుతున్నామని డీకే శివకుమార్ (dk shivakumar) చెప్పారు. సరిహద్దు సమస్యపై మళ్లీ మహారాష్ట్ర పరువు తీశారని ప్రశ్నించగా మా రాష్ట్రంలో మేము మంచి పనులు చేస్తాం, వాళ్ల రాష్ట్రంలో వాళ్లు చేయనివ్వండి, కేవలం అశాంతి సృష్టించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం, అక్కడి కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాటిని మేము ప్రోత్సహించమని డీకే శికుమార్ (dk shivakumar) అన్నారు.












Click it and Unblock the Notifications