డీకే జెంటిల్ మెన్ అయితే సీబీఐకి ఎందుకు భయపడుతున్నాడు. ఏమైనా సత్యహరిశ్చంద్రుడా ?
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ను సీబీఐ కేసుల నుంచి రక్షించి తన కుర్చీ కాపాడుకోవడానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రయత్నిస్తున్నారని ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుర్చీల కుమ్ములాట మొదలైయ్యిందని కర్ణాటక శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు.
అందులో భాగంగా అవనీతిపరుడైన డీకే శివకుమార్ ను రక్షించడాని సీఎం సిద్దరామయ్య కంకణం కట్టుకున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిజంగా సత్యహరిశ్చంద్రుడు అయితే అవినీతి కేసుల నుంచి తప్పించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడని, సీబీఐ కేసులకు ఎందుకు భయపడుతున్నాడని బీజేపీ నాయకడు అశోక్ ప్రశ్నించారు.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు సీఎం కుర్చీ అప్పగించాలనే భయంతో సిద్దరామయ్య ఉన్నారని, అందుకే ఆయన మంత్రివర్గం మీద ఒత్తిడి తెచ్చి డీకే శివకుమార్ మీద నమోదు అయిన సీబీఐ కేసులను వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆర్. అశోక్ ఆరోపించారు. సిద్దరామయ్య సీఎం అయిన ప్రతిసారి ఆయన అవినీతిపరులను కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆర్. అశోక్ ఆరోపించారు.

ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీద అక్రమాస్తులు సంపాధించారని ఆరోపణలు రావడంతో 2019 సెప్టెంబర్ 25వ తేదీన అప్పటి కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చింది. అయితే సిద్దరామయ్య ప్రభుత్వం డీకే శివకుమార్ మీద సీబీఐ విచారణను వెనక్కి తీసుకోవడాన్ని కర్ణాటకలోని బీజేపీ, జేడీఎస్ పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. మొత్తం మీద డీకే శివకుమార్ సీబీఐ కేసుల విచారణ విషయం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications