కరుణానిధి హెల్త్ బులిటెన్ ఇదే: చికిత్స ఇలా (వీడియో)

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని కావేరీ ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.

 DMK Chief Dr M Karuananidhi has been hospitalised yet again

కరుణానిధికి ప్రస్తుతం వాయు నాళంలో రంధ్రం పెట్టి శ్వాస అందిస్తూ (Tracheostomy) చికిత్స చేస్తున్నామని కావేరీ ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. గొంతు, ఊపిరితిత్తుల ఇన్పెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కరుణానిధిని గురువారం అర్దరాత్రి తరువాత కావేరీ ఆసుప్రతికి తరలించారు.

ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. ఈ సమయంలో కరుణానిధి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు ఆందోళనతో ఆసుపత్రి దగ్గరకు పరుగు తీయడ్యంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

 DMK Chief Dr M Karuananidhi has been hospitalised yet again

ఈ సమయంలో కరుణానిధికి అందిస్తున్న వైద్యం గురించి శుక్రవారం మద్యాహ్నం కావేరీ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటిన్ విడుదల చేశాయి. కురుణానిధి త్వరగా కొలుకుంటారని ఆసుపత్రి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

ఈ సందర్బంలో కరుణానిధి కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు కావేరీ ఆసుపత్రిలో మకాం వేశారు. ఎప్పటికప్పుడు కరుణానిధి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. కరుణానిధికి ఏమీ కాదని, మీరు ధైర్యంగా ఉండాలని స్టాలిన్ అభిమానులకు మనవి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+