Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

DMK–Congress:కూటమి బ్రేక్ అప్ - మార్చి 3 డెడ్‌లైన్‌తో స్టాలిన్ అల్టిమేటం..!!

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల నగారా మోగకముందే వేడి పతాక స్థాయికి చేరింది. దశాబ్ద కాలంగా అన్యోన్యంగా సాగుతున్న డీఎంకే (DMK) - కాంగ్రెస్ కూటమి ఇప్పుడు విడాకుల అంచున నిలబడినట్లు కనిపిస్తోంది. సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన, చివరకు రాహుల్ గాంధీ - ఎంకే స్టాలిన్ మధ్య వ్యక్తిగత దూరం పెంచే వరకు వెళ్లింది. తాజాగా డీఎంకే విధించిన 'డెడ్ లైన్' ఇప్పుడు సత్యమూర్తి భవన్‌లో (కాంగ్రెస్ కార్యాలయం) కలకలం రేపుతోంది.

మార్చి 3.. అదే ఆఖరి తేదీ!

సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించడానికి డీఎంకే అధినేత స్టాలిన్ మార్చి 3ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది.మార్చి 16న జరిగే రాజ్యసభ ఉప ఎన్నికల కోసం మార్చి 5 లోపే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందో లేదో తేలితేనే,ఆ సీటును ఎవరికి కేటాయించాలనేది డీఎంకే నిర్ణయించుకోగలదు.అందుకే "మార్చి 3 దాటితే మా దారి మాదే" అని అరివాలయం (డీఎంకే ప్రధాన కార్యాలయం)వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

dmk-congress-alliance-on-brink-stalin-s-march-3-deadline-sparks-tension-how-will-rahul-gandhi-act

రాహుల్ గాంధీ ఆగ్రహానికి కారణం అదేనా?

డీఎంకే తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.డీఎంకేతో పొత్తును తెంచుకోవాలని ఆయన దాదాపు 99 శాతం ఫిక్స్ అయ్యారట.దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ ఐదుగురు సభ్యుల కమిటీ చీఫ్ గిరీష్ చోడంకర్ ఇచ్చిన నివేదిక.డీఎంకే నేతలు తమను కనీసం మనుషులుగా కూడా గౌరవించడం లేదని,'పవర్ షేరింగ్'అనే మాట ఎత్తితేనే అసహనం వ్యక్తం చేస్తున్నారని రాహుల్ వద్ద ఆయన వాపోయారు."కూటమి నుంచి మీరే వెళ్ళిపోండి అన్నట్లుగా డీఎంకే ప్రవర్తిస్తోంది"అని చోడంకర్ చెప్పిన మాటలు రాహుల్‌కు ఆగ్రహం తెప్పించాయి.

పుట్టినరోజు శుభాకాంక్షల్లోనూ అదే 'కోల్డ్ వార్'!

ఈ విభేదాలు బయటపడటానికి స్టాలిన్ పుట్టినరోజు వేడుకలే నిదర్శనం.గతంలో స్టాలిన్‌ను "మై డియర్ బ్రదర్"అని సంబోధించే రాహుల్,ఈసారి చాలా ఆలస్యంగా శుభాకాంక్షలు తెలిపారు. అందులోనూ 'బ్రదర్'అనే పదం లేకుండా కేవలం "తమిళనాడు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు"అని మొక్కుబడిగా ముగించారు.దీనికి స్టాలిన్ కూడా అంతే దీటుగా స్పందించారు.ఇతర నేతలకు సుదీర్ఘంగా కృతజ్ఞతలు చెప్పిన స్టాలిన్,రాహుల్‌కు మాత్రం కేవలం "థాంక్యూ (Thank you for your warm wishes)" అని ఒక్క మాటతో తేల్చేశారు."నువ్వు దూరం పెడితే..నేను కూడా అదే స్థాయిలో ఉంటా"అనే సంకేతాన్ని స్టాలిన్ పంపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ ఒక్క శాతం ఆశ..ప్రియాంక గాంధీ!

కూటమి పూర్తిగా విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి కేవలం 1 శాతం మాత్రమే అవకాశం ఉంది.సోనియా గాంధీ ఈ పొత్తును కొనసాగించాలని బలంగా కోరుకుంటున్నారు.అయితే ఆమె నేరుగా రాహుల్ తో మాట్లాడకుండా,ప్రియాంక గాంధీ ద్వారా రాయబారం నడుపుతున్నారట."డీఎంకే మనకు నమ్మకమైన మిత్రపక్షం,వారిపై కఠినంగా ఉండవద్దు"అని ప్రియాంక రాహుల్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

మార్చి 3వ తేదీ సాయంత్రం లోపు కాంగ్రెస్ హైకమాండ్ దిగి రాకపోతే,డీఎంకే తన సొంత దారి చూసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.అటు రాహుల్ పంతం,ఇటు స్టాలిన్ పట్టుదల మధ్య ఈ పాత మిత్రుల బంధం కొనసాగుతుందా?లేక ఎన్నికల వేళ తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలవుతాయా?అనేది మరో 24 గంటల్లో తేలిపోనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+