వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయకు డిఎంకె నివాళి,జనరల్ బాడీ సమావేశంలో తీర్మాణం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల డిఎంకె జనరల్ బాడీ సమావేశం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.బతికున్న సమయంలో ఉప్పు నిప్పుగా ఉండే ఈ పార్టీల నాయకులు చనిపోయిన సమయంలో మాత్రం సంతాపాన్ని తెలపడం గమనార్హం

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :అనారోగ్యంతో మరణించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు డిఎంకె జనరల్ బాడీ సమావేశం సంతాపాన్ని తెలిపింది. అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత బతికున్న కాలంలో డిఎంకె చీఫ్ కరుణానిధి, మద్య సత్సంబంధాలు లేవు. రెండు పార్టీల నేతల మద్య పత్రీకార చర్యలు కొనసాగాయి.

అనారోగ్య కారణాలతో ఆపోలో ఆసుపత్రిలో జయలలిత మరణించారు.అయితే ఆమె మరణం తర్వాత అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. డిఎంకె చీఫ్ కరుణానిధి కూడ ఆరోగ్య పరిస్థితులు సక్రమంగా లేని కారణంగా స్టాలిన్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాద్యతలను కట్టబెట్టారు.

స్టాలిన్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాద్యతలను కట్టబెట్టేందుకుగాను బుదవారం నాడు చెన్నైలో డిఎంకె కార్యవర్గసమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్టాలిన్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాద్యతలను కట్టబెట్టేందుకుగాను జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు.

dmk general body meeting expressed grief over the death of late jayalalita of late tamilnadu

జయకు సంతాపం తెలిపిన డిఎంకె జనరల్ బాడీ సమావేశం
జయలలిత బతికున్న సమయంలో కరుణానిధి, జయలలితకు మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థులపై కక్షసాధింపు ధోరణులతో నడిచేవారు.అయితే అనారోగ్యంతో జయలలిత మరణించడంతో బుదవారం నాడు జరిగిన డిఎంకె పార్టీ సమావేశంలో జయకు సంతాపం తెలుపుతూ తీర్మాణం చేసింది డిఎంకె .

ఈ జనరల్ బాడీ సమావేశంలో 16 తీర్మాణాలను ఆమోదించారు. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. 2014 ప్రారంభంలో సుప్రీం కోర్టు జల్లికట్టును నిషేధించింది. జంతువుల సంరక్షణ పేరుతో ఈ జల్లికట్టుపై సుప్రీం నిషేధాన్ని విధించాలని ఆదేశించింది. అయితే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని డిఎంకె కోరింది.

2016 జనవరి 8వ, తేదిన కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఈ విషయమై లేఖ కూడ రాసింది. మరో వైపు తమిళనాడు కుచెందిన జాలర్లు శ్రీలంక ప్రభుత్వం అరెస్టుచేసింది. శ్రీలంక ప్రభుత్వం అరెస్టు జాలర్లను వెంటనే విడుదల చేయాలని డిఎంకె డిమాండ్ చేసింది.

పెద్ద నగదు నోట్ల రద్దును ఆ పార్టీ వ్యతిరేకించింది. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ సమావేశం కేంద్రాన్ని కోరింది.

English summary
dmk general body meeting expressed grief over the death of late jayalalita of late tamilnadu chiefminister, along with that dmt passed 16 resolutions in meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X