వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీరుకు బెదిరింపు, అప్పుడు మద్దతు.. నవ్వడం నేరమా: శశికళపై స్టాలిన్

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను రాజీనామా చేయాలని బెదిరించిన వారి పైన చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత స్టాలిన్ బుధవారం నాడు డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను రాజీనామా చేయాలని బెదిరించిన వారి పైన చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత స్టాలిన్ బుధవారం నాడు డిమాండ్ చేశారు. తనతో బలవంతంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించారని పన్నీరు సెల్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

శశికళని జయ నమ్మినా.. మోడీ దెబ్బ: సంక్షోభం వెనుక పెద్ద కథే!శశికళని జయ నమ్మినా.. మోడీ దెబ్బ: సంక్షోభం వెనుక పెద్ద కథే!

ఈ నేపథ్యంలో స్టాలిన్ స్పందించారు. పన్నీరు సెల్వంతో ఎవరు బలవంతంగా రాజీనామా చేయించారో వారి పైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. పన్నీరు ఆరోపణల పైన శశికళ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నవ్వినా నేరమేనా?

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ప్రతిపక్ష నేత స్టాలిన్ ఇరువురు పరస్పరం చూసుకొని నవ్వుకోవడాన్ని వీకే శశికళ ప్రశ్నించారు. దీనిపై స్టాలిన్ స్పందించారు.

జయలలిత జీవించి ఉన్నప్పుడు అసెంబ్లీలో తనను చూసి నవ్వుతూ పలకరించేవారని, శశికళ ఇప్పుడు జయలలితను కూడా ప్రశ్నిస్తారా అని స్టాలిన్ అడిగారు. గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో పాలన కుప్పకూలిపోయిందని, గవర్నర్ వెంటనే చెన్నైకి రావాలన్నారు.

స్టాలిన్‌తో కలిసి నవ్వుతూ తిరిగితే ఏమైనా నేరం చేసినట్లా అని ప్రశ్నించారు. ఎదుటి వ్యక్తిని పలకరించేటప్పుడు నవ్వుతూ స్పందించడమేనది మానవ నైజమన్నారు. మనిషి లోపల లోపలే నవ్వుకోవడం సాధ్యమయ్యే పని కాదన్నారు.

{photo-feature}

English summary
DMK Working President MK Stalin on Tuesday said action should be taken against those who had threatened former Tamil Nadu Chief Minister O Panneerselvam to resign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X