తమిళనాడు బంద్ లో హింస, పోలీసులకు గాయాలు, కేంద్రానికి వార్నింగ్, రైళ్లు, బస్సులు!
చెన్నై: కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడును నిర్లక్షం చేస్తోందని ఆరోపిస్తూ డీఎంకే పార్టీ ఇచ్చిన రాష్ట్ర బంద్ హింసాత్మకంగా మారింది. చెన్నై నగరంలోని మెరీనా బీచ్ సమీపంలో డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేసిన తరువాత ఆ పార్టీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు.

చెన్నైలో రచ్చరచ్చ
చెన్నైలోని అన్నాసలై, నంగంబాక్కం, కొడంబాక్కం, మౌంట్ రోడ్డు, బిసెంట్ రోడ్డు తదితర ప్రాంతాల్లో డీఎంకే పార్టీకి చెందిన వేలాధి మంది డీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్ల మీదకు రావడంతో జనజీవనం అస్థవ్యస్తం అయ్యింది.

ఆర్ టీసీ బస్సులు
తమిళనాడులోని దిండుగల్, క్రిష్ణగిరి జిల్లాలోని హోసూరు, వేలూరు, చెన్నై నగర శివార్లలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆర్ టీసీ బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. ఒక్క వేలూరు జిల్లాలోనే 20 బస్సులు ధ్వంసం అయ్యాయి. హోసూరులో కేఎస్ఆర్ టీసీ బస్సులు ధ్వంసం చేశారు. దిండుగల్ లో తమిళనాడుకు చెందిన 10 ఆర్ టీసీ బస్సులు ధ్వంసం చేశారు.

ప్రతిపక్ష నాయకులు అరెస్టు
చెన్నై నగరంలోని మెరీనా బీచ్ సమీపంలో ఆందోళన చేస్తన్న ఎంకే. స్టాలిన్ కు పలు పార్టీలు, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఆ సమయంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొనడంతో పొలీసులు స్టాలిన్ తదితరులను అరెస్టు చేసి పోలీసు వాహనాల్లో స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పోలీసులకు తీవ్రగాయాలు
ఎంకే స్టాలిన్ ను అరెస్టు చేసిన తరువాత డీఎంకే కార్యకర్తలు పోలీసు వాహనాలపై రాళ్ల వర్షం కురిపించారు. ఆ సందర్బంలో కుమార్ అనే పోలీసు అధికారి తలకు బలంగా రాళ్లు తగలడంతో తీవ్రగాయాలైనాయి. వెంటనే పోలీసు అధికారి కుమార్ ను సాటి పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

రైళ్లు, బస్సులు బంద్
చెన్నై నగరంతో సహ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో రైలురాకోలు నిర్వహించారు. రైళ్లు మీద రాళ్లు రువ్వడం గుర్తించిన అధికారులు వాటిని రైల్వే స్టేషన్ లకు రానివ్వకుండా మార్గం మధ్యలోనే నిలిపివేశారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని డీఎంకే ఇచ్చిన రాష్ట్ర బంద్ లో హింసచోటు చేసుకుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications