హీరోయిన్ల చేతులు పట్టుకుని లాగిన సీనియర్ డైరెక్టర్.. నెటిజన్లు ఫైర్! (వీడియో)

టాలీవుడ్ చెప్పుకోదగ్గ దర్శకేంద్రులలో ముందుగా గుర్తొచ్చే పేరు కె.రాఘవేంద్రరావు. ఆయన మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన దర్శకుడు అనిల్ రావిపూడి నూతన సినిమా లాంచింగ్ ఈవెంట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ముహూర్తపు వేడుక గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు రాఘవేంద్రరావు కూడా హాజరయ్యారు.

ఈ ఈవెంట్లో ముహూర్తపు షాట్‌కు గౌరవ దర్శకుడిగా రాఘవేంద్ర రావు వ్యవహరించారు. అయితే షాట్ కోసం నటీనటులను పొజిషన్లో నిలబెట్టే తరుణంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టిల చేతులు పట్టుకుి తన వైపునకు గట్టిగా లాగడం క్లిప్‌లో కనిపించింది. మొదట కీర్తి సురేష్ చేతిని పట్టుకుని లాగిన ఆయన.. ఆ తర్వాత కృతి శెట్టిని పక్కకు జరిపారు. ఆ వెంటనే హీరోలు వెంకటేష్, కల్యాణ్ రామ్‌లు హీరోయిన్లు భుజాలపై చేతులు ఎలా వేయాలో ప్రాక్టికల్‌గా చూపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో వివాదం రాజుకుంది.

Raghavendra Rao Faces Backlash After Viral Video with Keerthy Suresh and Krithi Shetty Details

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎక్స్ వేదికగా దర్శకేంద్రుడిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. "ఆడవారి అనుమతి లేకుండా అలా తాకే హక్కు ఈ ముసలాయనకు ఎవరు ఇచ్చారు?", "తాకకుండా కూడా సీన్ వివరించవచ్చు కదా.. ఎందుకంత వింత ప్రవర్తన?" అంటూ నెటిజన్లు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. గతంలో నటి నిహారిక కొణిదెల విషయంలో కూడా ఆయన ఇలాగే ప్రవర్తించి ట్రోల్స్ ఎదుర్కొన్నారని, ఆ ఘటన తర్వాత కూడా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని కొందరు పాత విషయాలను గుర్తు చేస్తున్నారు.

అయితే ఈ వివాదంపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అభిమానులు, పరిశ్రమకు చెందిన కొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆయన కేవలం ఓ దర్శకుడిగా షాట్ పర్ఫెక్ట్ గా రావడం కోసమే నటీమణులకు పొజిషన్లు వివరించారని.. ఇందులో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని వెనకేసుకొస్తున్నారు. కేవలం కెమెరా యాంగిల్స్ సెట్ చేసే క్రమంలో జరిగిన సాధారణ విషయాన్ని కొందరు కావాలనే వివాదం చేస్తున్నారని వారు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ స్టార్ డైరెక్టర్ వీడియో ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+