అనవసరంగా..: పన్నీరుకు వ్యతిరేకంగా ఈసీని కలిసిన శశికళ వర్గం

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో తమిళనాట మరోసారి రాజకీయం వేడెక్కింది. గురువారం శశికళ వర్గం ఈసీని కలిసింది. ఎంపీ తంబిదురై నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందం ఈసీని కలిసి పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక సజావుగానే జరిగిందని వివరణ ఇచ్చింది.

ఈ సందర్భంగా తంబిదురై మాట్లాడారు. శశికళనే తమ పార్టీ ప్రధాన కార్యదర్శి అని, పార్టీ నియమాలకు అనుగుణంగా ఆమె ఎన్నిక జరిగిందని, కొంతమంది అనవసరంగా సమస్యను లేవనెత్తుతున్నారని, ఇది సమయం కాదని, ఇప్పటికే ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు.

Do not entertain dissenters, Sasikala camp leaders urge EC

అంతకుముందు ఎన్నికల కమిషన్‌ను కలిసిన పన్నీర్‌ సెల్వం శశికళను పార్టీ పదవికి అర్హురాలు కాదని, ఆమె ఎన్నిక చెల్లదని పేర్కొన్నారు. పార్టీ పదవికి మళ్లీ ఎన్నిక నిర్వహించాలని అభ్యర్థించారు. అలాగే అన్నాడీఎంకే గుర్తు రెండాకులను కూడా తమ వర్గానికే కేటాయించాలని ఈసీని కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK leader M. Thambidurai on Thursday requested the Election Commission “not to entertain” the dissenting cadres who have staked claim for the AIADMK symbol ''Two Leaves'' and sought fresh election to the general secretary’s post.
Please Wait while comments are loading...