వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్పీకి ఓటేసి.. మీ ఓటును వృథా చేసుకోకండి: మాయావతి

'ఎస్పీకి ఓటేసి మీ విలువైన ఓటును వృథా చేసుకోవద్దు. బీఎస్పీ పార్టీకే మీ ఓటు వేయండి' అని ముస్లిం ఓటర్లకు మాయావతి పిలుపునిచ్చారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యూపీ తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదురోజుల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో.. ఆయా పార్టీలు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి. సోమవారం నాడు బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతి ఫరూకాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రచారంలో భాగంగా ఓటర్లను ఉద్దేశించిన మాట్లాడిన మాయావతి.. 'ఎస్పీకి ఓటేసి మీ విలువైన ఓటును వృథా చేసుకోవద్దు. బీఎస్పీ పార్టీకే మీ ఓటు వేయండి' అని ముస్లిం ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో పనులన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాని అన్నారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసం అఖిలేష్ సర్కార్ డబ్బులు వృథా చేస్తోందని మండిపడ్డారు.

Do not waste your votes by giving it to Samajwadi Party: Mayawati tells Muslims in Farrukhabad rally

ఎస్పీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పై కూడా మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు విధానాల వల్లే కాంగ్రెస్ అధికారంలో లేకుండా పోయిందని విమర్శించారు. కాగా, యూపీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ పొత్తుతో బరిలో దిగుతుండగా.. బీఎస్పీ, బీజేపీలు ఒంటరిగా బరిలో దిగుతున్నాయి.

యూపీలో తొలి దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11నుంచి ప్రారంభం కానుంది. మొత్తం తొమ్మిది దశల్లో యూపీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. మార్చి 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.

English summary
The Bahujan Samaj Party (BSP) Supremo Mayawati on Monday advised Muslims not to “waste” their votes by giving it to presently ruling Samajwadi Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X