Aadhaar: పదేళ్లకు ఒక్కసారి ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిందేనా..!
ప్రస్తుతం ఏ పనికి అయినా ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే చాలా మంది ఆధార్ ఎప్పుడో పదేళ్ల క్రితం తీసుకుని ఉంటారు. అయితే వారు ఇప్పుడు ఆధార్ అప్డేట్ చేసుకోవాలా లేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆధార్ తీసుకుని పదేళ్లు దాటితే ఆధార్ అప్డేట్ చేసుకోవడమే మంచిదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతోంది. ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలి.
ఆధార్ వెబ్ సైట్ కు వెళ్లాలి. ఉడాయ్ లో ఆధార్ నంబర్ తో లాగిన్ కావాలి. ఆ తర్వాత లేటెస్ట్ గుర్తింపు కార్డు, చిరునామా నమోదు చేసి ఎంటర్ చేయాలి. గుర్తింపు కార్డు ఫొటో ఉన్న గుర్తింపు కార్డునే వాడాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ గుర్తింపు కార్డు ఉపయోగించవచ్చు. వీటిని అడ్రస్, ఐడెంటికి వాడుకోవచ్చు. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను అడ్రస్ ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించవచ్చు.ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన స్కాన్డ్ కాపీలను 'మై ఆధార్' వెబ్‌సైట్ లో అప్‌లోడ్ చేయాలి.

ఆధార్ తీసుకుని పదేళ్లై.. మధ్యలో అడ్రస్ లేదా ఫోన్ నంబర్ లేదా ఫొటో లేదా మెయిల్ ఐడీ, స్పెల్లింగ్ కరెక్షన్ చేసుకున్నవారు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు ఆధార్ తీసుకున్న ఐదేళ్ల తర్వాత అప్డేట్ చేసుకున్నట్లయితే.. ఇప్పుడు మళ్లీ అప్డేట్ అవసరం లేదు. పదేళ్లలో ఎలాంటి అప్డేట్ చేయని వారు మాత్రమే ప్రస్తుతం ఆధార్ అప్డేట్ చేసుకుంటే మంచిది.
పదేళ్ల నుంచి ఎలాంటి మార్పు లేదు. అదే అడ్రస్, అదే ఫోన్ నంబర్, అదే మెయిల్ ఐడీ ఏం మారకుండా ఉంటే.. కనీసం ఫొటోనైనా అప్డేట్ చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో అడ్రస్, జెండర్ మార్పు చేసుకోవచ్చు. మిగతా అప్డేట్ల కోసం ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఉడాయ్ తాజాగా ఫోన్ నంబర్ కూడా ఆన్ లైన్ అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications