వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పొందడం ఎలా.. ఇక్కడ తెలుసుకోండి..!!

|
Google Oneindia TeluguNews

భారత్‌లో సెకండ్ వేవ్ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు తిరిగి పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతోంది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు, వారాంతపు కర్ఫ్యూలు విధించాయి. మాస్కులు తప్పనిసరిచేస్తూ కోవిడ్ నిబంధనలు పాటించని వారికి జరిమానాలు సైతం విధిస్తున్నాయి. ఇక దేశంలో కరోనాపై విజయం సాధించేందుకు భారత ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పెద్ద ఎత్తున ప్రారంభించింది. ఇప్పటికే దేశంలో చాలామందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తికాగా.. తాజాగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు కూడా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుగా స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆరోగ్యసేతు యాప్ లేదా కోవిన్ యాప్ పై పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు వ్యాక్సిన్ పూర్తయ్యాక వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను కూడా ఈ రెండు యాప్‌లపై నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇకపై ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్ మన జీవితంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇంకా సులభంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీ స్మార్ట్‌ఫోన్‌లోనే పొందొచ్చు. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ వాట్సాప్ ద్వారా పొందేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీరెక్కడికైనా ప్రయాణిస్తుంటే మీ వద్ద అప్పటికప్పుడు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకుంటే కంగారు పడాల్సిన పనిలేదు.

Do you know how to download covid vaccination certificate on whatsapp - Here is how

కేంద్ర ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్ వాట్సాప్ ద్వారా సెకన్లలో పొందే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఈ ఫోన్‌ నెంబర్‌ను మీ కాంటాక్ట్ లిస్టులో సేవ్ చేసి పెట్టుకోవడమే. 9013151515 అనే ఈ ఫోన్ నెంబర్‌ను సేవ్ చేసుకుని వాట్సాప్‌కు వెళ్లి అక్కడ Certificate అని టైప్ చేయండి. ఇది మీ రిజిస్టర్ చేసుకున్న నెంబర్ నుంచి మాత్రమే పంపాలి. ఇలా సర్టిఫికేట్ అని టైప్ చేయగానే మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ క్షణాల్లో మీ వాట్సాప్‌కు వచ్చేస్తుంది. మీ నెంబర్‌కు కోవిన్ నుంచి వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Recommended Video

Omicron Variant : Symptoms & Doctors Opinion || Oneindia Telugu

ఒకవేళ ఒకే నెంబర్ పై ఒకరికంటే ఎక్కువ మంది పేర్లు నమోదై ఉండి ఉన్నట్లయితే... ఎవరి సర్టిఫికేట్ కావాలని హెల్ప్‌డెస్క్ అడుగుతుంది. ఆ ప్రకారంగా ఎవరి సర్టిఫికేట్ కావాలో మెన్షన్ చేస్తే వారి సర్టిఫికేట్ డౌన్‌లోడ్ అవుతుంది.

English summary
One can download vaccination certificate on whatsapp by typing and sending certificate to 9013151515.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X