కుతుబ్ మినార్ అసలు పేరు, చరిత్ర ఏంటో తెలిస్తే .. మీ మైండ్ బ్లాక్ అవుద్ది
కుతుబ్ మినార్ భారతదేశంలోని ఢిల్లీ నగరంలో ఉన్న ఒక చారిత్రక కట్టడం.దీనిని 5వ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య నిర్మించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకలతో నిర్మించిన మినార్‌లలో ఒకటి. దీని ఎత్తు 72.5 మీటర్లు. దీనిని 1193లో ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించడం ప్రారంభించాడు.అతను ఢిల్లీ సుల్తానేట్‌ను స్థాపించిన తరువాత ఈ మినార్‌ను నిర్మించాడు. ఐబక్ మొదటి అంతస్తును మాత్రమే పూర్తి చేయగలిగాడు. తరువాత అతని అల్లుడు ఇల్తుత్‌మిష్ దీనిని పూర్తి చేశాడు. తరువాత ఫిరోజ్ షా తుగ్లక్ దీనికి మరమ్మతులు చేయించాడు.దీనికి కుతుబుద్దీన్ ఐబక్ పేరు పెట్టడానికి ప్రధాన కారణం, దీనిని 1193లో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించడమే. దీనిని పూర్తి చేసిన ఇల్ టుట్ మిష్ కుతుబుద్దీన్ ఐబక్ పై గౌరవంతో అతని పేరు పెట్టారు.
అయితే కుతుబ్ మినార్ అసలు పేరు విష్ణు స్తంభం.కుతుబ్ మినార్ ఆవరణలోనే ఉన్న లోహ శాస్త్ర విచిత్రం లాంటి ఇనుప స్తంభంపై 4వ శతాబ్ధానికి చెందిన బ్రహ్మీ లిపిలో రాయబడిన శాసనాధారాల ప్రకారం కుతుబ్ మినార్ పూర్వపు పేరు విష్ణు ధ్వజం అని తెలుస్తుంది. విష్ణు దేవుని స్తంభమనే అర్ధంలో వాడారట. హిందు శిల్పకళా పద్దతిని ప్రతిబింబించేలా స్తంభంపై అలంకరించిన గరుడ శిల్పం ఉంది.మీనార్‌ను నిర్మించిన కొండ ప్రాంతాన్ని కృష్ణ పాదమని పిలుస్తారు.

దీనిని విజయ స్తూపంగా ముస్లిం పాలకులు పేర్కొన్నారు. మహ్మద్ ఘోరి పృథ్విరాజ్ పై సాధించిన విజయానికి ఇది చిహ్నం అని చెబుతారు. కొందరు చరిత్ర కారుల పరిశీలనల ప్రకారం క్రీస్తుకు పూర్వమే 280 లో సముద్ర గుప్తుడనే రాజు నిర్మించిన వేధశాల అని చెబుతున్నారు. కుతుబ్ మినార్ ఒకప్పుడు విష్ణు స్తంభం అని, దాన్ని హిందూ రాజు కాలంలో విష్ణు ఆలయంపై నిర్మించారని వీహెచ్‌పీ నేత వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు. హిందూ పాలకుల కాలంలో నిర్మించిన విష్ణువు ఆలయంపై 73 మీటర్ల ఎత్తైన కట్టడాన్ని నిర్మించారని పేర్కొన్నారు. ప్రతి ఏడాది జూన్ నెలలో 22 వ తేదీన భూమి మీద దీని నీడ పడదు.ఈ కట్టడం 5 డిగ్రీలు వంపు కలిగి ఉండటం వలన భూమధ్య రేఖకు అటు ఇటుగా సూర్యుడి చలనం వలన దీని నీడ ఆ ప్రత్యేక రోజున భూమి మీద పడదు.
కుతుబ్ మినార్ నిర్మాణం:
కుతుబ్ మినార్ ఎర్ర ఇసుకరాతితో నిర్మించబడింది. దీనిలో ఐదు అంతస్తులు ఉన్నాయి. దీని చుట్టూ అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి.
కుతుబ్ మినార్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు:
కుతుబ్ మినార్ సమీపంలో ఒక ఇనుప స్తంభం ఉంది. ఇది 1600 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. కానీ ఇప్పటికీ తుప్పు పట్టలేదు.కుతుబ్ మినార్‌లో అనేక శాసనాలు ఉన్నాయి. ఇవి పర్షియన్, అరబిక్ భాషలలో ఉన్నాయి. కుతుబ్ మినార్ ఢిల్లీలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు దీనిని సందర్శిస్తారు.
కుతుబ్ మినార్ సందర్శన:
కుతుబ్ మినార్ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉంది. ఇది ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. భారతీయులకు ప్రవేశ రుసుము ₹ 30, విదేశీయులకు రూ.500.












Click it and Unblock the Notifications