షాక్: కంచి స్వామీజీతో శశికళ అక్క కోడుకు భేటీ: వెనుక చక్రం తిప్పిన బీజేపీ !
శశికళ అక్క కుమారుడు టీటీవీ. దినకరన్ ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా రహస్యంగా కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీని కలుసుకుని కేంద్ర ప్రభుత్వంతో మీరు మాట్లాడాలని
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వం కొనసాగించాలంటే ఇప్పుడు కేంద్రం అండకావాలని శశికళకు తెలిసివచ్చినట్లుంది. అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ అక్క కుమారుడు టీటీవీ. దినకరన్ ఇప్పుడు స్వామీజీల ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నారు.
ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం దినకరన్ తమిళనాడు ప్రభుత్వ పెద్దలు, అన్నాడీఎంకే పార్టీలోని నాయకులకు చెప్పాపెట్టకుండా రహస్యంగా కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీని కలుసుకుని మాకు అండగా ఉండాలని కాళ్లు పట్టుకున్నారని వెలుగు చూసింది.
బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి వీరిద్దరి భేటీకి రాయబారం చేశారని సమాచారం. 2004లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ హత్య కేసులో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

తరువాత స్వామీజీ నిర్దోషిగా బయటకు వచ్చారు. అప్పటి నుంచి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ భక్తులు, ఆయన వర్గీయులు అన్నాడీఎంకేకి దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు అదే అన్నాడీఎంకే పార్టీ మీ దగ్గరకు వస్తోందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కంచి పీఠాధిపతితో మాట్లాడి దినకరన్ భేటీకి అవకాశం ఇవ్వాలని మనవి చేశారని సమాచారం.
తమిళనాడు బీజేపీ నాయకులు సైతం ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు. శశికళ వర్గంలోని మన్నార్ గుడి మాఫియా మీద విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం అండ అవసరం అని శశికళ వర్గం భావించింది.
మైనారిటీ ఓట్లు దూరం అవుతాయనే భయంతో టీటీవీ. దినకరన్ రహస్యంగా కంచి పీఠాధిపతిని కలుసుకుని తమకు అండగా ఉండాలని, బీజేపీ నాయకులతో మీరు మాట్లాడాలని మనవి చేశారని విశ్వసనీయ సమాచారం.
అయితే కంచి మఠాధిపతి దినకరన్ కు ఎలాంటి హామీ ఇచ్చారు అనే విషయం మాత్రం బయటకు రాలేదు. బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకుని ఇక ముందు వారు ప్రభుత్వం మీద విమర్శలు చెయ్యకుండా ఉండటానికి దినకరన్ స్వామీజీని కలిశారని గురువారం వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications