వైద్యం కోసం వచ్చి.. డాక్టర్ వందనను పొడిచి చంపేశాడు: కేరళలో భారీ ఆందోళనలు
తిరువనంతపురం: వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తి.. వైద్యురాలిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో చోటు చేసుకుంది. కొట్టారకర తాలూకా ఆస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న 23 ఏళ్ల వందన దాస్‌ను వైద్య చికిత్స కోసం వచ్చిన ఓ దుండగుడు పదునైనా కత్తెరతో పొడిచి చంపేశాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో కలకలం రేపింది. పెద్ద ఎత్తున వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళనలకు దిగారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొట్టారకర తాలూకా ఆస్పత్రిలో వందన దాస్ హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. మద్యం మత్తులో కుటుంబసభ్యులతో గొడవ పడ్డ సందీప్ అనే ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్ కాలికి గాయం కావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతనికి వందనా దాస్ చికిత్స అందించారు. కాలి గాయానికి డ్రెస్సింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా డాక్టర్ వందనపై దాడి చేశాడు సందీప్.

కత్తెర, ఇతర పదునైన పరికరాలతో వందను విచక్షణారహితంగా పొడిచాడు.
దీంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిబ్బంది, పోలీసులపైనా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వందనను తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలతో పరిస్థితి విషమించడంతో వందన మృతి చెందారు. ప్రస్తుతం నిందితుడు సందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్ డీ అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నట్టుగా చెబుతున్నారు.
కేరళ వ్యాప్తంగా ఆందోళనలు
వందనాదాస్ హత్యకు నిరసనగా కేరళలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కేరళ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలునిచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని.. హౌస్ సర్జన్‌లు కూడా స్ట్రైక్‌లో పాల్గొంటారని స్పష్టం చేసింది. కొట్టారకర తాలూకా ఆస్పత్రిలో మొత్తం సేవలను నిలిపివేశారు. వైద్యులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. వైద్యవిద్యార్ధులు క్లాస్‌లను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
డాక్టర్ హత్య నేపథ్యంలో వైద్య విద్యార్థులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంటర్న్‌లు, హౌస్ సర్జన్లకు భద్రత కల్పించాలి. ఆరోగ్య కార్యకర్తలకు కల్పిస్తున్న భద్రతను ఆస్పత్రిలో పనిచేస్తున్న విద్యార్థులకు కూడా కల్పించాలని వినతిపత్రంలో కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన హ్యూమన్ రైట్స్ కమిష న్.. వారం రోజుల్లో నివేదిక అందించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. మరోవైపు, కేరళ రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీలు మండిపడ్డాయి.
Indian Medical Association (IMA) calls for the "implementation of Central laws and measures to prevent violence against healthcare professionals at their workplaces and declare hospitals as Safe Zone", following the murder of a doctor in Kerala by a man brought for a medical… pic.twitter.com/jEAyWkrDOw
— ANI (@ANI) May 10, 2023
డాక్టర్ వందన మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంని వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో డాక్టర్లపై దాడి చేయడం ఆమోదయోగ్యం కాదని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం విజయన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆస్పత్రిలో వందనాదాస్ మృతదేహానికి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ , సీఎం విజయన్ నివాళి అర్పించారు.
కేంద్ర విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ స్పందిస్తూ.. ఈ విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెడికల్ టూరిజానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేరళలో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ ఘటన కేరళ ప్రతిష్టను దెబ్బతీసిందని.. కేరళలోని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది భద్రత లోపాలను తేటతెల్లం చేసిందని విమర్శించారు.
కాగా, వైద్యురాలి హత్య ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) తీవ్రంగా స్పందించింది. 'కేంద్ర చట్టాల అమలు, వారి కార్యాలయంలో ఆరోగ్య సంరక్షణ నిపుణులపై హింసను నిరోధించడానికి చర్యలు' కోసం పిలుపునిచ్చింది ఐఎంఏ. ఆస్పత్రులను సేఫ్ జోన్‌లుగా ప్రకటించాలని ఐఎంఏ స్పష్టం చేసింది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications