చికిత్సకు వెళితే రోగులను రేప్ చేసిన వైద్యులు
న్యూఢిల్లీ/గాంధీనగర్: రెండు వేర్వేరు ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరి మీద వైద్యులు అత్యాచారం చేశారు. రోగులు అని కనికరం లేకుండా వారి మీద అత్యాచారం చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని లజపత్ నగర్ లో సుశీల్ మంజిల్ (55) అనే డాక్టర్ తన భార్య (డాక్టర్)తో కలిసి సొంతంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. ఈనెల 2వ తేదిన 24 సంవత్సరాల యువతి చాతి నొప్పిగా ఉందని ఆసుపత్రికి వెళ్లింది.

చికిత్స చేస్తానని నమ్మించిన డాక్టర్ తన చాంబర్ లోకి పిలిపించి అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి మీద అత్యాచారం జరిగిందని వైద్యపరిక్షలలో నిర్దారణ అయ్యిందని పోలీసులు చెప్పారు. సుశీల్ కుమార్ ను అరెస్టు చేశారు.
డెంగీ అని వెలితే డాక్టర్ రేప్ చేశాడు
గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో డెంగీ వ్యాధితో భాదపడుతున్న రోగి మీద డాక్టర్ అత్యాచారం చేశాడు. గాంధీనగర్ లోని భాట్ ప్రాంతంలో అపోలో ఆసుపత్రి ఉంది. ఓ మహిళ డెంగీ వ్యాధికి చికిత్స చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లింది.
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 మధ్య చికిత్స చేస్తున్న డాక్టర్ తన మీద అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణ మొదలైయ్యిందని, ఇంకా ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని పోలీసులు చెప్పారు. అయితే కేసు దర్యాప్తు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని అపోలో ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.












Click it and Unblock the Notifications