చంద్రయాన్ 3 ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించిన లేడీ ప్రొఫెసర్ డాక్టర్ రీతూ ఎవరంటే !
తిరుపతి/శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించారు. చంద్రయాన్ 3 విజయవంతమైతే, అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.
చంద్రయాన్-3 ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్తలలో ఒకరైన డాక్టర్ రీతు కరిడాల్ శ్రీవాస్తవ్ కృషి చాలా ఉంది. రీతూ కరిడాల్ ఎవరు? అని ఇప్పుడు చాలా మంది ఆమె గురించి ఆరా తీస్తున్నారు. డాక్టర్ రీతూ కరిడాల్ గతంలో చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్‌గా పని చేశారు.

రితు కరిడాల్ భారతదేశం యొక్క మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంఓఎం) మంగళయాన్ యొక్క డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్. రీతూ రాకెట్ లేడీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందారు. రీతూ కరిడాల్ లక్నోలో పుట్టి పెరిగారు. లక్నో విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో BSc పట్టా పొందిన రీతూ కరిడాల్ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ) నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఎంఇ చదివారు.
తర్వాత 1997లో రితు కరిడాల్ ఇస్రోలో చేరారు. మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డు డాక్టర్ రీతు కరిడాల్ అందుకున్నారు. 2015లో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ & ఇండస్ట్రీస్ (ఎస్ఐఏటీఐ) ద్వారా ఇస్రో టీమ్ అవార్డు, విమెన్ అచీవర్స్ ఇన్ ఏరోస్పేస్ 2017 అవార్డు కూడా రితు కరిడాల్ అందుకున్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం రితు కరిడాల్ ఎల్లప్పుడూ అంతరిక్షం పట్ల ఆకర్షితులైనారు. ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్న రితు కరిడాల్ ఇస్రో, నాసా వార్తా నివేదికల పేపర్ కటింగ్స్ సేకరించేవారు. రితు కరిడాల్ జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్‌లో 20కి పైగా ఆర్టికల్స్ రాసి ప్రచురించారు. చంద్రయాన్-3 వెనుక ఉన్న శాస్త్రవేత్తల్లో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్ర్తవేత్త రితు కరిడాల్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు.












Click it and Unblock the Notifications