Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలిక కడుపులో రెండు కిలోల వెంట్రుకల బంతి ; తొలగించిన వైద్యులు ఏం చెప్పారంటే

ఓ బాలిక కడుపు నుండి దాదాపు రెండు కిలోల వెంట్రుకలను తొలగించిన అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో చోటుచేసుకుంది. లక్నోలోని బలరాంపూర్ హాస్పిటల్‌లో 17 ఏళ్ల బాలిక కడుపు నుండి దాదాపు 2 కిలోల బరువున్న పెద్ద వెంట్రుకల బంతిని వైద్యులు తొలగించారు. ఇక ఈ ఆపరేషన్ పై గ్యాస్ట్రో-సర్జన్ డాక్టర్ ఎస్ ఆర్ సమద్దర్ మాట్లాడుతూ, ట్రైకోబెజోవర్ అనే అరుదైన వ్యాధితో 17 సంవత్సరాల బాలిక బాధపడుతుందని, దీనిలో రోగులు తమ వెంట్రుకలను వాళ్లే పీక్కుని తినేస్తారని చెప్పారు.

 అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలికకు శస్త్రచికిత్స .. కడుపు నుండి 2 కేజీల హెయిర్ బాల్ తొలగింపు

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలికకు శస్త్రచికిత్స .. కడుపు నుండి 2 కేజీల హెయిర్ బాల్ తొలగింపు

10 రోజుల క్రితం, లక్నోకు చెందిన అమ్మాయి ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చిందని , వాంతులు మరియు కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిందని వెల్లడించారు.
ఆమె పొత్తికడుపు పై భాగంలో వాపు వచ్చిన క్రమంలో ఆమె సమస్యను అల్ట్రాసౌండ్, ఎక్స్-రే లేదా సిటి స్కాన్ ద్వారా గుర్తించలేక పోయామని , ఎండోస్కోపీ చేసి, ఆమె కడుపులో పెద్ద ట్రైకోబెజోవర్‌ను కనుగొన్నామని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ సమద్దర్ తనతో పాటు వైద్యుల బృందంతో కలిసి గురువారం బాలికకు శస్త్రచికిత్స నిర్వహించి , ఆమె కడుపు నుండి 20 సెంటీమీటర్ల పొడవు మరియు 15 సెంటీమీటర్ల వెడల్పు గల 2 కేజీల బరువున్న వెంట్రుకల బాల్ ను తొలగించారు.

 వెంట్రుకల బాల్ కారణంగా బాలికకు అనారోగ్యం

వెంట్రుకల బాల్ కారణంగా బాలికకు అనారోగ్యం

ఆ ముద్ద ఆ అమ్మాయి కడుపు లోపల బంతి రూపంలో ఉందని వెల్లడించారు. వెంట్రుకల బంతి కారణంగా, ఆహారం కడుపులో ఉండదని, అది చిన్న ప్రేగులోకి వెళ్ళదని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల, అమ్మాయి బలహీనంగా ఉందని గుర్తించామని పేర్కొన్న వైద్యులు ఆమె 17 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటికీ ఆమె బరువు 32 కిలోలు మాత్రమే ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న వెంట్రుకల బంతిని తొలగించామని. ఆమె త్వరలో కోలుకుంటుందని వెల్లడించారు . నాలుగైదు రోజుల్లో ఆహారం తీసుకోగలదని చెబుతున్నారు వైద్యులు.

మానసిక రుగ్మత వల్లే జుట్టు తినే అలవాటు

మానసిక రుగ్మత వల్లే జుట్టు తినే అలవాటు

జుట్టు తినే అమ్మాయి యొక్క వింత అలవాటుకి కారణం గురించి అడిగినప్పుడు, డాక్టర్ సమద్దర్ ఈ వ్యాధి సాధారణంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న రోగులలో కనిపిస్తుందని చెప్పారు. ఇది మానసిక సమస్య. వ్యక్తి తన జుట్టును పీక్కుని, ఇతరులకు చూపించకుండా దాచిపెట్టి తింటారని వెల్లడించారు. సర్జరీ తర్వాత అమ్మాయి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పుడు, ఆమెను మనోరోగచికిత్స విభాగానికి సూచిస్తానని వైద్యులు వెల్లడించారు. అక్కడ ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తారని తెలిపారు. ఆమెకు మానసిక చికిత్స మరియు సామాజిక చికిత్స ఇవ్వబడుతుంది. కానీ ఆమె తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కుమార్తె జుట్టు తింటుందని తమకు తెలీదన్న పేరెంట్స్

కుమార్తె జుట్టు తింటుందని తమకు తెలీదన్న పేరెంట్స్

అమ్మాయి తల్లిదండ్రులు తమ కుమార్తెను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. ఆమెకు సకాలంలో చికిత్స చేయగలిగినందుకు ఉపశమనం పొందారు. ఆమె రెండు నెలలుగా కడుపునొప్పితో బాధ పడుతుందని, తనకు జుట్టు తినే అలవాటు ఉందని మాకు తెలియదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆమె ఇంట్లో సాధారణంగా ఉండే అమ్మాయి తండ్రి చెప్పారు. మొత్తానికి బాలిక కడుపులో నుండి రెండు కిలోల వెంట్రుకల బంతిని తొలగించిన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి బాలిక ప్రాణాలు కాపాడారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+