భోపాల్‌లో కుక్క‌ను చంపిన‌ డాగ్ ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది..

కొంత‌మంది మూగ‌జీవాల ప‌ట్ల ఎంతో ప్రేమ క‌న‌బ‌రుస్తుంటారు. కానీ, మ‌రికొంద‌రేమో వాటి ప‌ట్ల అమానుషంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఈ మ‌ధ్య‌కాలంలో సోష‌ల్‌మీడియాలో పెంపుడు కుక్క‌ల గురించి చాలా వార్త‌లు చూసాం. కుక్క‌కు ఓ య‌జామాని ఎంతో వైభవంగా సీమంతం చేయ‌డం, మ‌రొక‌రేమో కుక్క పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఎంతో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేయ‌డం వంటివి చూశాం. అయితే తాజాగా భోపాల్‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న మూగ‌జీవాల ప్రేమికుల‌ను షాక్‌కు గురిచేస్తుంది. ఓ కుక్క‌ను గేట్‌కి వేలాడదీసి మ‌రి దాన్ని అతి క్రూరంగా హింసించి చంపేసారు. కుక్క మెడ‌కు గొలుసు క‌ట్టి మ‌రీ గేట్‌కి దాన్ని వేలాడ‌దీసారు డాగ్ ట్రైనింగ్ సెంట‌ర్ సిబ్బంది. ఆ కుక్క‌కు ఊపిరాడ‌నియ‌కుండా చేసి చివ‌ర‌కు ఆ కుక్క‌ను చంపేసారు డాగ్ ట్రైనింగ్ సెంట‌ర్ సిబ్బంది...

నెల‌కి రూ. 13 వేలు : ఈ దారుణ‌మైన ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌కి చెందిన ఓ బిజినెస్‌ మేన్ రెండేళ్లుగా ఓ కుక్కను ఎంతో ప్రేమ‌గా పెంచుకుంటున్నాడు. అయితే ఈ ఏడాది మే నెలలో ఆ కుక్క‌కు ట్రైనింగ్ ఇప్పించేందుకు ఓ సెంటర్‌కి తీసుకొచ్చాడు. ఆ ట్రైనింగ్ సెంట‌ర్ భోపాల్‌లో ఉంది. అది ఆల్ఫా డాగ్ ట్రైనింగ్ సెంటర్‌. నెలకి 13 వేల రూపాయ‌ల చొప్పున ఈ కుక్క‌కి వసూలు చేస్తోంది ఈ డాగ్ ట్రైనింగ్ సెంటర్. ఈ ఏడాది సెప్టెంబర్‌తో కుక్క‌కి శిక్ష‌ణ పూర్త‌వ్వాల్సి ఉంది. అయితే, కుక్క ఉన్న‌ట్టుండి చ‌నిపోయింద‌ని కుక్క య‌జమానికి చెప్పారు ట్రైనింగ్ సిబ్బంది. ఈ విష‌యం అక్టోబ‌ర్ 9వ తేదిన జ‌రిగింది. అయితే ఆ కుక్క య‌జ‌మానికి ఎందుకో అనుమానం వ‌చ్చింది.

 Dog training center staff kills a dog video goes viral

వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు ఆ య‌జ‌మాని. అక్క‌డ ఉన్న సీసీ కెమెరాల‌ను ప‌రిశీలించ‌గా ట్రైనింగ్ సిబ్బంది నిర్వాకం బ‌య‌ట‌ప‌డింది. డాగ్‌ ట్రైనింగ్ సెంటర్‌లో కుక్క మెడకు గొలుసు కట్టి గేట్‌కి వేలాడదీశారు. ట్రైనింగ్ సెంట‌ర్‌లోని ఆ ఇద్దరు ఉద్యోగులు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. అయితే, నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. అంతేకాదు వీరిద్ద‌రూ సీసీ కెమెరాలో ఈ ఫుటేజ్‌ రికార్డ్ అవ్వకుండా డిలీట్ చేసేందుకూ కూడా ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. అయితే, ఆ సిబ్బంది మూగ‌జీవి ప‌ట్ల ఎందుకు ఇంత క్రూరంగా ప్ర‌వ‌ర్తించారో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+