Dolo 650: డోలో మాత్రల కంపెనీకి డోలు వాయించిన ఐటీశాఖ, ఒకప్పుడు సొంత ఇల్లులేదు, ఇప్పుడు కోటీశ్వరుల!
బెంగళూరు/ చెన్నై: డోలో 650 మాత్రల పేరు ప్రతిసామాన్యుడికి తెలుసు. కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడుకు ప్రపంచ దేశాలు మందులు కనిపెట్టడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో డోలో 650 మాత్రల పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. డోలో 650 మాత్రలు వేసుకుంటే కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చు అని భావించిన ప్రజలు అప్పట్లో ఆ మాత్రలను విపరీతంగా వాడేశారు. ప్రపంచ దేశాలు సైతం డోలో 650 మాత్రలు ఎగుమతి చేసుకోవడానికి ఆ మాత్రలు తయారు చేస్తున్న మైక్రో ల్యాబ్స్ మీద ఆదారపడ్డారు. అలాంటి డోలో 650 మాత్రలు తయారు చేస్తున్న మైక్రో ల్యాబ్స్ మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
ఒకప్పుడు ఉండటానికి బెంగళూరులో సొంత ఇల్లు కూడా లేని మైక్రో ల్యాబ్స్ అదినేతలు దిలీప్ సురానా, ఆనంద్ సురానా ఈ రోజు భారతదేశంలోని 100 మంది శ్రీమంతుల జాబితాలో చోటు సంపాధించుకున్నారు. ఆదాయపన్ను ఎగగెట్టారని ఆరోపణలు రావడంతో బెంగళూరు నగరంలోని మైక్రో ల్యాబ్స్ కార్యాలయంతో పాటు దేశంలోని ఆ కంపెనీకి చెందిన 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.

డోలో 650 మాత్రలు ఫేమస్
కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడుకు ప్రపంచ దేశాలు మందులు కనిపెట్టడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో డోలో 650 మాత్రల పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. డోలో 650 మాత్రలు వేసుకుంటే కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చు అని భావించిన ప్రజలు అప్పట్లో ఆ మాత్రలను విపరీతంగా వాడేశారు.

కరోనా టైమ్ లో 350 కోట్ల మాత్రలు విక్రయాలు
కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడుకు ప్రపంచ దేశాలు మందులు కనిపెట్టడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో సుమారు 350 కోట్లకు పైగా డోలో 650 మాత్రలు విక్రయించారని వెలుగు చూసింది. కరోనా వైరస్ మహమ్మారి దేశంలో తాండవం చేస్తున్న సమయంలోనే డోలో 650 మాత్రలు తయారు చేస్తున్న మైక్రో ల్యాబ్స్ కంపెనీ నిర్వహకులు సంవత్సరంలో సుమారు రూ.450 కోట్లకు పైగా వ్యాపారం చెయ్యడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

17 కంపెనీల్లో మైక్రో ల్యాబ్స్...... హాట్ టాపిక్
భారతదేశంలో ఔషదాలు (మందులు) తయారు చేస్తున్న 17 కంపెనీల్లో మైక్రో ల్యాబ్స్ సంస్థ భారీ లాబాలు సొంతం చేసుకుని తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. ఇదే మైక్రో ల్యాబ్ సంస్థ సీఎండీ దిలీప్ సురానా, ఆ కంపెనీ డైరెక్టర్ ఆనంద్ సురానా (సురానా బ్రదర్స్) దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపారు.

ఐటీ శాఖ దాడులు
డోలో 650 మాత్రలు తయారు చేస్తున్న బెంగళూరులోని మైక్రో ల్యాబ్స్ మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మైక్రో ల్యాబ్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం బెంగళూరులోని రోస్ కోర్స్ రోడ్డులో ఉంది. బెంగళూరులోని కార్యాలయంతో పాటు చెన్నై, తమిళనాడ, గోవా, పంజాబ్, సిక్కీం తదితర 40 ప్రాంతాల్లో బుధవారం ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి సోదాలు చేసి పలు పత్రాలు పరిశీలిస్తున్నారు.

ఆరోజు బెంగళూరులో సొంత ఇల్లు లేదు, ఈ రోజు ?
ఒకప్పుడు ఒకప్పుడు ఉండటానికి బెంగళూరులో సొంత ఇల్లు కూడా లేని మైక్రో ల్యాబ్స్ అదినేతలు దిలీప్ సురానా, ఆనంద్ సురానా ఈ రోజు భారతదేశంలోని 100 మంది శ్రీమంతుల జాబితాలో చోటు సంపాధించుకున్నారు. అకౌంటెంట్ గా ఉద్యోగం చేసే దిలీప్ సురానా చెన్నై నుంచి బెంగళూరు చేరుకుని అద్దె ఇంటిలో ఉండేవారు.

శ్రీమంతుల జాబితాలో 94వ స్థానం
ఇప్పుడు భారతదేశంలోని 100 మంది కోటీశ్వరుల జాబితాలో సురానా బ్రదర్స్ 94వ స్థానంలో ఉన్నారు. ఆదాయపన్ను ఎగగెట్టారని ఆరోపణలు రావడంతో బెంగళూరు నగరంలోని మైక్రో ల్యాబ్స్ కార్యాలయంతో పాటు దేశంలోని ఆ కంపెనీకి చెందిన 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications