భయం వద్దు! వ్యాక్సిన్ వేసుకోండి: ఈ 97 ఏళ్ల బామ్మ మాట బంగారు బాటే (వీడియో)
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ కొందరు వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు. మరికొందరు అపోలహలతో వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ 97 ఏళ్ల వృద్ధురాలు వ్యాక్సిన్ వేసుకోవాలంటూ పిలునిచ్చారు. తాను వ్యాక్సిన్ తీసుకున్నానని.. మిగిలినవారంతా కూడా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు.
Recommended Video

వ్యాక్సిన్ తీసుకున్నా.. నొప్పులు లేవు.. నో సైడ్ ఎఫెక్ట్స్
ప్రస్తుతం ఆ 97ఏళ్ల మహిళకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీనియర్ జర్నలిస్ట్ లతా వెంకటేశ్ ఆమె వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. తాను మార్చిలోనే తొలి వ్యాక్సిన్ డోసు తీసుకున్నానని.. తానిప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు ఆ వృద్ధ మహిళ పేర్కొన్నారు. ఎలాంటి నొప్పులు లేవని, సైడ్ ఎఫెక్ట్‌లు కూడా లేవని ఆమె స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ తీసుకునేందుకు భయపడొద్దంటూ 97ఏళ్ల మహిళ పిలుపు
'ఎవరూ భయపడొద్దు. వ్యాక్సిన్ తీసుకోండి. అది మీకు, మీతోపాటు ఉన్న వారందరికీ మంచిది' అని ఆ మహిళ వీడియోలో పేర్కొన్నారు. తాను వ్యాక్సిన్ రెండో డోసు తీసుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ ఎంతో సురక్షితమైనది, తాను వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా సాధారణంగానే ఉన్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడంపై ఎలాంటి అపోహలు, భయాలు అవసరం లేదని తేల్చి చెప్పారు.
యువ మహిళ అంటూ జర్నలిస్టు పోస్టు..
ఈ యువ మహిళ కొందరిలోనైనా మార్పు తీసుకొస్తుందని తాను భావిస్తున్నట్లు ఆ వీడియో ట్వీట్‌పై వెంకటేశ్ రాసుకొచ్చారు. ఆమె తన ఫ్రెండ్ ఆంటీ అని పరిచయం చేశారు. ఆమె చెప్పిన విషయాలు కొందరిపైనైనా మంచి ప్రభావం చూపిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
మహిళ వీడియో వైరల్.. స్ఫూర్తిప్రధాత అంటూ ప్రశంసలు
కాగా, ఆ మహిళ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వేలాది మంది.. లైక్స్ కొట్టడంతోపాటు రీట్వీట్లు చేస్తున్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆ మహిళ మాటలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని నెటిజన్లు కొనియాడుతున్నారు. కాగా, మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 18-44 ఏళ్ల వయస్కులకు కూడా కరోనా వ్యాక్సిన్ వేస్తున్న విషయం తెలిసిందే. కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్‌లో ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చు. తొలుత కరోన వారియర్స్ అయిన హెల్త్ కేర్ సిబ్బందికి, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 45ఏళ్లపైబడినవారికి వ్యాక్సిన్ ప్రారంభించారు. ఇప్పుడు 18ఏళ్ల పైబడినవారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications