వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సార్, పెళ్ళి కుదిరింది, పాస్ చేయరు, ఆన్సర్ షీట్ పై విద్యార్థిని వేడుకోలు

పరీక్ష పత్రాల్లో తమను పాస్ చేయించాలని కోరితే టీచర్లు పాస్ చేశారని చెబితే విన్న ఘటనలు మనకు గుర్తుండే ఉంటుంది. స్నేహితుతో పిచ్చాపాటి మాట్లాడే సమయంలోనో, సీనియర్లు ఈ తరహా ఘటనలను తరచూ ప్రస్తావిస్తుంటారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: పరీక్ష పత్రాల్లో తమను పాస్ చేయించాలని కోరితే టీచర్లు పాస్ చేశారని చెబితే విన్న ఘటనలు మనకు గుర్తుండే ఉంటుంది. స్నేహితుతో పిచ్చాపాటి మాట్లాడే సమయంలోనో, సీనియర్లు ఈ తరహా ఘటనలను తరచూ ప్రస్తావిస్తుంటారు.ఇదే తరహా ఘటన ఒకటి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది మాదిరిగా పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు తీసుకొన్నారు. దీంతో ఓ విద్యార్థిని తాను ఈ పరీక్షల్లో పాస్ కావాలని భావించింది.

'Don't Fail Me, I'm Getting Married,' UP Girl's Creative Exam Answer Doesn't Amuse Examiner

ఈ మేరకు వినూత్నంగా ఆలోచించింది. జవాబు పత్రంలో తనను పాస్ చేయాలంటూ అభ్యర్థించింది. సార్, నేను ఓ అమ్మాయిని, వచ్చే జూన్ 28న, నా వివాహం జరగనుంది. దయచేసి నన్ను ఈ పరీక్షల్లో పాస్ చేయండంటూ జవాబు పత్రం మీద రాసింది.

తాను ఫెయిల్ అయితే తమ కుటుంబమంతా బాధపడుతోందని ఆమె చెప్పుకొచ్చింది. తన పరిస్థితిని అర్థం చేసుకోండి అంటూ యూపీ బోర్డు ఎగ్జామ్స్ లో ఓ విధ్యార్థిని రాసింది.

తాను పెళ్ళికి సిద్దంగా ఉన్న సమయంలోనే పరీక్షలో ఫెయిలైతే చిన్నచూపుగా ఉంటుందని చెబితే పాస్ చేస్తారని ఆ యువతి అతి తెలివిని ప్రదర్శించింది.

చదవకున్నా ఎలగైనా పాస్ కావాలనే ఉద్దేశ్యంతోనే ఎగ్జామ్ బోర్డుకు ప్రతి ఏడాది ఇలాంటి సమాధాన పత్రాలు వేలాదిగా వస్తుంటాయని పేపర్లు దిద్దే ఉపాధ్యాయులు చెబుతున్నారు.

కొందరు విద్యార్థులైతే నేరుగా 50,100,500 రూపాయాల నోట్లను ఆన్సర్ షీట్లకు జతచేసి లంచం ఇవ్వజూపేవారని చెప్పారు. అయితే గత ఏడాది తరహా పరిస్థితి ఇప్పుడు లేదు. చదువుకొంటేనే పాస్ అయ్యే పరిస్థితి నెలకొంది. లంచం ఇవ్వజూపినా ఎలాంటి ప్రయోజంన ఉండదని ఓ ఉన్నతాధికారి విద్యార్థులకు సూచించారు.వీరిని పాస్ చేసినా ఏ సబ్జెక్ట్ లేని కారణంగా ఉద్యోగాల వేటలో వెనుకంజలో ఉండాల్సి వస్తోందన్నారు.

English summary
Appearing for board exams, a girl in UP wrote this in her answer sheet, Sir, I’m a girl and getting married on June 28. Please pass me otherwise my family will be upset."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X