పాక్‌కు షాక్: 'భారత సైన్యంతో పెట్టుకోవద్దు జాగ్రత్త'
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో శిబిరాలు ఏర్పరుచుకున్న ఉగ్రవాదుల పైన భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత సైన్యాన్ని అందరూ కీర్తిస్తున్నారు. నెటిజన్లు భారత్ మాతాకీ జై, సైన్యానికి సలామ్, జై జవాన్ అంటూ పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో రెజ్లర్ సుశీల్ కుమార్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో సర్జికల్ స్ట్రయిక్ పైన స్పందించారు. భారత సైన్యంతో పెట్టుకోవద్దు జాగ్రత్త అని పేర్కొన్నారు. 'భారతీయ్ సేనా సే పంగా మత్ లేనా.. జైహింద' అని హిందీలో ట్వీట్ చేశారు.

వీరేంద్ర సెహ్వాగ్, యోగేశ్వర్ దత్, విజేందర్ సింగ్‌లు కూడా భారత సైన్యం తీసుకున్న చర్యపై హర్షం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ కూడా భారత సైన్యం చేసిన సాహసంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రతి ఒక్క భారతీయుడి ప్రాణం ఎంతో విలువైందని నిరూపించిన జవాన్లకు హ్యాట్సాఫ్ అని అన్నారు.












Click it and Unblock the Notifications