Reliance Jio 18 నెలల ఫ్రీ ఆఫర్- ఇష్టం వచ్చినట్టు వాడేయ్యొచ్చు

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కూడా ఈ రంగంలో అడుగు పెట్టింది. దాని అనుబంధ సంస్థ రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాతో కలిసి ప్రత్యేకంగా జాయింట్ వెంచర్ ను నెలకొల్పింది. రిలయన్స్ ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ (REIL) గా దీనికి పేరు పెట్టారు. ఎంటర్‌ప్రైజ్ AI సేవలను అభివృద్ధి చేయడం, మార్కెటింగ్ పై ఈ సంస్థ దృష్టి సారిస్తుంది.

ఈ మేరకు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందాల ప్రక్రియ పూర్తయింది. ఈ జాయింట్ వెంచర్ ఒప్పందం ప్రకారం REIL లో రిలయన్స్ ఇంటెలిజెన్స్ 70 శాతం వాటాను కలిగి ఉంటుంది. మిగిలిన 30 శాతం వాటాను ఫేస్‌బుక్ సొంతం చేసుకుంటుంది. రెండు భాగస్వామ్య సంస్థలు దాదాపు 855 కోట్ల రూపాయలను ప్రారంభ పెట్టుబడిగా పెట్టనున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసులను మరింత విస్తృతం చేసే దిశగా కార్యకలాపాలు కొనసాగిస్తాయి.

Don t Miss Out Google Gemini Pro AI Plan Available at No Cost for Jio Customers

తాజాగా రిలయన్స్ జియో యూజర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. గూగుల్ అనుబంధంగా పని చేస్తోన్న జెమిని ఏఐ (Gemini AI) ప్రో ఉచితంగా అందజేయనుంది. దీని విలువ 35,000 రూపాయలు. గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. భారత్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సేవలను సామాన్యుల వరకు చేరవేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గూగుల్ AI సేవలను అందించడానికి రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని గుర్తు చేశారు.

ఇందులో భాగంగా జియో వినియోగదారులకు 18 నెలల పాటు మా AI ప్రో ప్లాన్ అదనపు ఖర్చు లేకుండా లభిస్తుందని తెలిపారు. జెమిని 2.5 ప్రో, 2TB స్టోరేజ్, AI క్రియేషన్ టూల్స్ ఉంటాయని అన్నారు. రిలయన్స్ 'AI ఫర్ ఆల్' విజన్‌కు అనుగుణంగా వినియోగదారులు, వ్యాపారాలు, డెవలపర్లకు ఈ ఫ్రీ యాక్సెస్ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. దీనివల్ల భారత్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తుందని అన్నారు.

భారత్ లో రిలయన్స్ జియోకు ఉన్నఅపారమైన కనెక్టివిటీనీ దీనికోసం వినియోగించుకుంటోన్నామని సుందర్ పిచాయ్ చెప్పారు. జెమిని 2.5 ప్రో మోడల్‌ యాక్సెస్, నానో బనానా, వీఓ 3.1 మోడల్‌తో ఫొటోలు రూపొందించడానికి, వీడియోలను తీయడానికి ఎటువంటి పరిమితి ఉండబోదు. వివిధ రంగాల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం నోట్‌బుక్ ఎల్ ఎంకు యాక్సెస్ లభిస్తుంది. అలాగే 2 టీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్ వంటివి ఉన్నాయి. ఈ 18 నెలల ఆఫర్ విలువ 35,100 రూపాయలు. దీన్ని ఉచితంగా అందిస్తోంది జియో.

అర్హత కలిగిన జియో వినియోగదారులు మై జియో యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. యువతకు సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో 5జీ అన్‌ లిమిటెడ్ ప్లాన్‌లలో ఉన్న 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల వినియోగదారులకు తొలిదశలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత వీలైనంత త్వరగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి జియో కస్టమర్‌కు అందుబాటులోకి వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+