బూస్టర్ డోసుల మిక్సింగ్ పై కేంద్రం క్లారిటీ- సేమ్ ఉండాల్సిందేనన్న కోవిడ్ టాస్క్ ఫోర్స్
భారత్ లో కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత వ్యాక్సిన్ల తయారీలో కొరత ఏర్పడింది. దీంతో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకునే విషయాన్ని పరిశీలించాలంటూ కేంద్రానికి పలు అభ్యర్ధనలు వచ్చాయి. అయితే ఆ తర్వాత వ్యాక్సిన్ల కొరత తీరిపోవడం, రెండు వ్యాక్సిన్లు కలిపి ఇచ్చే విషయంలో అధ్యయనాలు పూర్తికాకపోవడంతో కేంద్రం ఈ వ్యవహారాన్ని మర్చిపోయింది. ఇప్పుడు తాజాగా బూస్టర్ డోస్ ల విషయంలో మళ్లీ అవే ప్రశ్నలు మొదలయ్యాయి.
గతంలో కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇప్పుడు బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వస్తే అదే వ్యాక్సిన్ తీసుకోవాలా లేక మరో వ్యాక్సిన్ డోస్ తీసుకోవచ్చా అన్న దానిపై ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై కోవిడ్ జాతీయ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ వీకే పౌల్ స్పష్టత ఇచ్చారు. గతంలో ఏవైతే వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారో అదే వ్యాక్సిన్ ఇప్పుడు బూస్టర్ డోస్ గా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అలా కాకుండా మరో వ్యాక్సిన్ తీసుకుంటే ఇబ్బందులు తప్పవన్నారు.

Recommended Video
దేశంలో మరోసారి కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి కేంద్రం ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసులు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే 60 ఏళ్లు పైబడిన వారు కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ లపై సందిగ్ధత ఏర్పడింది. ఇప్పుడు కోవిడ్ టాస్క్ ఫోర్స్ చేసిన సూచనతో ఆ అనుమానాలు వీడిపోయాయి. కేంద్రం కూడా గతంలో ఇచ్చిన వ్యాక్సిన్ల మేరకు ఎన్ని డోసుల బూస్టర్ డోస్ అవసరమవుతుందో అంతే మొత్తంలో స్టాక్ ఆర్డర్ చేసేందుకు కూడా అవకాశం దక్కింది. దీంతో ఈ మేరకు వ్యాక్సిన్ బూస్టర్ డోసుల్ని కేంద్రం ఆర్డర్ పెట్టబోతోంది.మరో ఐదు రోజుల్లో మొదలయ్యే ఈ బూస్టర్ డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్ల పైబడిన వారికి ఇచ్చిన తర్వాత మిగిలిన వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేస్తారు.












Click it and Unblock the Notifications