టాయ్‌లెట్ లోకి ఫోన్ కూడా తీసుకెళ్తున్నారా?: డేంజర్ అంటున్న శాస్త్రవేత్తలు..
స్మార్ట్ ఫోన్ టాయిలెట్ లోకి తీసుకెళ్లడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Recommended Video

న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి జీవితాల్లో చాలా స్పేస్ ఆక్రమించుకుంది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలామందికి కష్టమే.
ఆఖరికి టాయిలెట్‌కి వెళ్లినా సరే, మొబైల్ ఫోన్‌ను వెంట తీసుకెళ్తున్నారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల డయేరియా, మూత్ర సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన డా.పాల్ అనే మైక్రోబయాలజిస్ట్ చెబుతున్నారు.

టాయ్‌లెట్‌లో ఉండే సింకులు, నల్లాలు, బేసిన్ల మీద ఇశ్చిరియా కొలై, క్లాస్ట్రీడియం డిఫిచిలే వంటి రోగకారక బాక్టీరియా ఉంటుందని చెబుతున్నారు. ఆ బాక్టీరియా స్మార్ట్ ఫోన్ల మీదకు చేరి శరీరంలోకి ప్రవేశించే అవకాశముందంటున్నారు. పడుకునేటప్పుడు సైతం ఫోన్ పక్కనే పడుకుంటారు కాబట్టి.. ఏదో ఒక సందర్భంలో దాని నుంచి బాక్టీరియా శరీరంలోకి చేరుతుందంటున్నారు.
బ్యాగులను శుభ్రం చేయకపోవడం, బూట్లను ఇంటి లోపల ధరించడం, విప్పడం, టీవీ రిమోట్, కంప్యూటర్ కీబోర్డు, మౌస్‌లను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా హానికారక బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications