ఇండియాలో ట్రంప్ కూతురు. భక్తురాలిలా మారి గుడిలో పూజలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్ తన భర్త మైఖేల్ బౌలస్‌తో కలిసి సైలెంట్ గా భారతదేశంలో వ్యక్తిగత పర్యటన చేస్తున్నారు. ఈ సాంస్కృతిక పర్యటనలో భాగంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రపంచ ప్రసిద్ధ 'స్వామినారాయణ్ అక్షరధామ్ దేవాలయం' వారిని ఎంతగానో ఆకట్టుకుంది. అక్షరధామ్ అద్భుత కట్టడాలు, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కళాఖండాలను చూసి ఈ జంట ముగ్ధులయ్యారు. ఈ పర్యటనకు సంబంధించిన విశేషాలను టిఫనీ ట్రంప్‌తో పాటు ఆలయ నిర్వాహకులు సామాజిక మాధ్యమం 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.

అక్షరధామ్ అనుభూతి 'నమ్మశక్యం కానిది'

అక్షరధామ్ ఆలయ సందర్శన ముగిసిన అనంతరం టిఫనీ ట్రంప్ మే 29న 'ఎక్స్' లో స్పందిస్తూ.. ఈ పర్యటన అత్యంత అద్భుతంగా, "నమ్మశక్యం కానిది" (incredible) అని అభివర్ణించారు. ఆలయ ప్రాంగణంలోని ఆధ్యాత్మికత, శిల్పకళా చాతుర్యంపై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. ఈ పర్యటనలో ఆమె భర్త, ప్రముఖ అమెరికన్-లెబనీస్ వ్యాపారవేత్త అయిన మైఖేల్ బౌలస్‌తో పాటు ఆమె ఆప్తమిత్రులు కూడా పాల్గొన్నారు.

Donald Trump Daughter Tiffany Enjoys India Tour As President Is Declared In Excellent Health By Doctors

అటు న్యూఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ సంస్థ సైతం ఈ పర్యటనను ధృవీకరిస్తూ మే 29న పోస్ట్ పెట్టింది. "భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని అన్వేషించిన ఓ అందమైన రోజు" అని పేర్కొంటూ, టిఫనీ ట్రంప్ బృందానికి BAPS స్వామినారాయణ్ అక్షరధామ్‌లో ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.

ట్రంప్ ఫోటోతో 250 డాలర్ల నోటు.. ఫోటో వైరల్ !!
ట్రంప్ ఫోటోతో 250 డాలర్ల నోటు.. ఫోటో వైరల్ !!

మరోవైపు, భారతదేశానికి అమెరికా రాయబారిగా వ్యవహరిస్తున్న సెర్గియో గోర్ కూడా 'ఎక్స్' వేదికగా ఈ జంటకు సాదర స్వాగతం పలికారు. "భారతదేశానికి మీకు స్వాగతం" అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మాజీ భార్య మార్లా మాపుల్స్ ల నాల్గవ సంతానమే టిఫనీ ట్రంప్. ఆమె విద్యావంతురాలు, 2020లో ప్రతిష్టాత్మక జార్జ్‌టౌన్ యూనివర్సిటీ లా సెంటర్ నుంచి 'జ్యురిస్ డాక్టర్' డిగ్రీని పొందారు.

ట్రంప్ గేదె ప్రాణాలను కాపాడిన బంగ్లాదేశ్ ప్రభుత్వం!
ట్రంప్ గేదె ప్రాణాలను కాపాడిన బంగ్లాదేశ్ ప్రభుత్వం!

పీపుల్.కామ్ నివేదికల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ ఇతర వివాహాల ద్వారా టిఫనీకి.. డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ ట్రంప్, బారన్ ట్రంప్‌లతో కలిపి మొత్తం నలుగురు సవతి సోదర సోదరీమణులు ఉన్నారు. కాగా, మైఖేల్ బౌలస్, టిఫనీల వివాహం నవంబర్ 12, 2022న ఘనంగా జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+