వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పైస్‌జెట్‌.. ప్రపంచంలోనే టాప్‌, థ్యాంక్స్ చెప్పిన ట్రంప్

విమాన ప్రయాణికులకు చౌక ధరల్లో సేవలందిస్తున్న దేశీయ విమాన సంస్థ స్పైస్‌జెట్‌ అరుదైన ఘనత సాధించింది. బ్లూమ్‌బర్గ్‌ ఇంటెలిజెన్స్‌ ఇండెక్స్‌ ఎయిర్‌లైన్‌ స్టాక్‌లో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు చౌక ధరల్లో సేవలందిస్తున్న దేశీయ విమాన సంస్థ స్పైస్‌జెట్‌ అరుదైన ఘనత సాధించింది. బ్లూమ్‌బర్గ్‌ ఇంటెలిజెన్స్‌ ఇండెక్స్‌ ఎయిర్‌లైన్‌ స్టాక్‌లో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది.

చౌకధరల్లో విమాన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో 2005లో గుడ్‌గావ్‌ కేంద్రంగా స్పైస్‌జెట్‌ను ప్రారంభించారు. అయితే రెండున్నరేళ్ల క్రితం ఈ విమానయాన సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది.

మూసివేత దశ నుంచి...

మూసివేత దశ నుంచి...

దాదాపు 2.2 బిలియన్‌ డాలర్ల ఇంధన బకాయిలతో ఒకానొక దశలో సంస్థను మూసివేసే పరిస్థితి ఏర్పడింది. అలాంటి గడ్డు పరిస్థితిని అధిగమించడానికి స్పైస్‌జెట్‌కు ఎంతోకాలం పట్టలేదు. ప్రయాణికులను ఆకర్షించేందుకు కొత్తకొత్త ఆఫర్లు తీసుకొచ్చిన స్పైస్‌జెట్‌.. అనతికాలంలో ఎయిర్‌లైన్‌ స్టాక్‌ మార్కెట్లో నంబర్‌వన్‌గా నిలిచింది. 2014 డిసెంబర్‌ నుంచి ఈ సంస్థ స్టాక్‌ 800 శాతం దాకా పెరిగింది. ప్రస్తుతం స్పైస్‌జెట్‌ మార్కెట్‌ విలువ 1.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఒక్క 2017లో స్పైస్‌జెట్‌ స్టాక్‌ విలువ 124 శాతం పెరిగింది.

205 కొత్త విమానాల కొనుగోలు...

205 కొత్త విమానాల కొనుగోలు...

ప్రస్తుతం స్పైస్‌జెట్‌ వద్ద 35 బోయింగ్‌, 20 బొంబార్డియర్‌ విమానాలున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ నుంచి 205 కొత్త విమానాలు కొనుగోలు చేయనున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో స్పైస్‌జెట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. నలభై కొత్త 737 మ్యాక్స్‌ 10 విమానాల కోసం జూన్‌ 19న బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆర్డరు విలువ 470కోట్ల డాలర్లు. అలాగే 50 బొంబార్డియర్‌ క్యూ400 విమానాల కొనుగోలు కూడా చేయనుంది.

పారిస్ లో ఒప్పందం...

పారిస్ లో ఒప్పందం...

అమెరికాకు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ తో స్పైస్ జెట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల పారిస్‌లో జరిగిన ఎయిర్‌షోలో ఇరు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా 737 మ్యాక్స్‌ మోడల్‌కు చెందిన 40 విమానాలను స్పైస్‌ జెట్‌కు సరఫరా చేయాల్సి ఉంటుందని బోయింగ్‌ పేర్కొంది.

థ్యాంక్స్ చెప్పిన ట్రంప్

థ్యాంక్స్ చెప్పిన ట్రంప్

భారత్‌లో ప్రముఖ చౌక విమానయాన సేవల సంస్థ స్పైస్‌జెట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. స్పైస్‌జెట్‌ అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో సుమారు 22 బిలియన్‌ డాలర్లతో కీలక ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందం ద్వారా అమెరికాలో సుమారు 1,32,000 ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ స్పైస్‌జెట్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

English summary
US President Donald Trump singled out Gurgaon-based SpiceJet for special praise after the Indian budget carrier placed a long-term order worth $22 billion for new aircraft from Boeing, helping create a substantial number of jobs in North America. An airline official said that the SpiceJet order, for up to 205 aircraft, will create about 132,000 jobs in the US. As of today, SpiceJet is the only carrier in India that is ordering aircraft from Boeing, with other low-cost carriers preferring Airbus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X