Doubt: రాత్రి సీక్రేట్ గా భార్య చాటింగ్, గార్మెంట్స్ యజమానికి ముందే డౌట్, మీద యాసిడో పోసి?
కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: వ్యాపారం చేస్తున్న భర్త ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కువగా బయట ఉంటున్నాడు. ఇటీవల భర్తకు అతని భార్య మీద డౌట్ వచ్చింది. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని భర్త రగిలిపోయాడు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రాత్రి భర్త ఇంటికి వెళ్లాడు. ఆ సందర్బంలో మొబైల్ ఫోన్ లో భార్య సీక్రేట్ గా చాటింగ్ చేస్తున్న విషయం చూసిన భర్త రెచ్చిపోయాడు, మొబైల్ చూపించాలని భార్యకు చెప్పాడు. మొబైల్ చూపించడానికి నిరాకరించిన భార్య మీద యాసిడ్ పోసిన భర్త ఇప్పుడు చాటింగ్ చేసుకో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

గార్మెంట్స్ వ్యాపారం
కోల్ కత్తాలోని నార్త్ 24 పరణగాస్ ఏరియాలోని అశోక్ నగర్ లో 36 ఏళ్ల రంజిత్ కుమార్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం రష్మీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతని రంజిత్ కుమార్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రంజిత్ కుమార్, రష్మీ దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

భార్య మీద డౌట్ మొదలైయ్యింది
రంజిత్ కుమార్, రష్మీ దంపతులకు మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. గార్మెంట్స్ వ్యాపారం చేస్తున్న రంజిత్ కుమార్ ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కువగా బయట ఉంటున్నాడు. ఇటీవల రంజిత్ కుమార్ కు అతని భార్య రష్మీ తీరులో మార్పులు రావడంతో ఆమె మీద అనుమానం వచ్చింది.

భార్యకు అక్రమ సంబంధం
తన భార్య రష్మీ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని రంజిత్ కుమార్ కొంతకాలం నుంచి రగిలిపోయాడు. ఇదే విషయంలో రోజు రంజిత్ కుమార్, రష్మీ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. రాత్రి రంజిత్ కుమార్ ఇంటికి వెళ్లాడు. ఆ సందర్బంలో రంజిత్ కుమార్ భార్య మొబైల్ లో బిజీగా ఉంది.

ఎదురు తిరిగిన భార్య
రష్మీ ఫోన్ లో ఎవరితోనో చాటింగ్ చేస్తున్న విషయం చూసిన రంజిత్ కుమార్ రెచ్చిపోయాడు, ఎవరితో చాటింగ్ చేస్తున్నావు, నీ మొబైల్ ఫోన్ చూపించాలని రంజిత్ కుమార్ అతని భార్యకు చెప్పాడు. మొబైల్ చూపించడానికి నిరాకరించిన రష్మీ ఆమె భర్త రంజిత్ కుమార్ కు ఎదురుతిరిగింది.

భార్య మీద యాసిడ్ పోసిన భర్త
ఆ సందర్బంలో యాసిడ్ బాటిల్ తీసుకు వచ్చిన రంజిత కుమార్ అతని భార్య మీద యాసిడ్ పోసి ఇప్పుడు చాటింగ్ చేసుకో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తీవ్రగాయాలైన భార్యను స్థానికులు కోల్ కత్తాలోని హబ్రా ఆసుపత్రికి తరలించారు. భార్య మీద యాసిడ్ దాడి చేసిన రంజిత్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications