"250 కుట్లు ఉన్నాయి.. నన్నలా ఈడ్చేస్తారా?": ఉన్నావ్ బాధితురాలి కన్నీటి రోదన!

ఉన్నావ్ అత్యాచార ఉదంతం దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది. ఈ తీర్పుపై బాధితురాలు తీవ్రస్థాయిలో ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసన తెలుపుతున్న ఆమెను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లడం పట్ల ఆమె తన బాధను మీడియా ముందు వెళ్లగక్కారు.

"కోర్టులో అంతా ఇంగ్లీషులోనే.. నాకేమీ అర్థం కాలేదు"
హైకోర్టులో జరిగిన వాదనల గురించి బాధితురాలు మాట్లాడుతూ, న్యాయవ్యవస్థ సామాన్యులకు ఎంత దూరంగా ఉందో వివరించారు."కోర్టులో వాదనలన్నీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ జరిగాయి. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఒకవేళ ఆ వాదనలు హిందీలో జరిగి ఉంటే, నా పక్షాన నేను కూడా జడ్జితో మాట్లాడి ఉండేదాన్ని. నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తికి బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించి ఉండేదాన్ని." అని ఆమె వాపోయారు.

Dragged Despite 250 Stitches Unnao Survivor Reacts to Kuldeep Sengar Bail

ఇండియా గేట్ వద్ద నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు తనను జంతువులా ఈడ్చుకెళ్లారని ఆమె ఆరోపించారు. "గతంలో జరిగిన ప్రమాదం వల్ల నా శరీరమంతా దాదాపు 250 కుట్లు ఉన్నాయి. కాళ్లు, చేతుల్లో ఇనుప రాడ్లు ఉన్నాయి. ఆ సంగతి తెలిసినా పోలీసులు నన్ను బలవంతంగా ఈడ్చి వాహనంలో పడేశారు. ఆ సమయంలో నాకు విపరీతమైన నొప్పి కలిగింది." అని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు తనను బంధించి, కుల్దీప్ సెంగార్‌కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని బెదిరించారని ఆమె ఆరోపించారు.

"నా చాచా జైల్లో.. రేపిస్టు బయట!"
న్యాయవ్యవస్థలో ఉన్న అసమానతలను ఆమె ఎత్తిచూపారు. "ఏ తప్పూ చేయని మా చాచా (బాబాయ్) ఏడేళ్లుగా జైల్లో మగ్గుతున్నారు. కానీ నా తండ్రి చావుకు కారణమై, నాపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తికి మాత్రం బెయిల్ వస్తోంది. డబ్బుకు ఉన్న శక్తి ఇదేనా?" అని ఆమె ప్రశ్నించారు. నిందితుడు బయటకు వస్తే తన కుటుంబానికి, సాక్షులకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

తదుపరి పోరాటం సుప్రీంకోర్టులోనే..
హైకోర్టు తీర్పుతో తాను మానసికంగా కృంగిపోయానని, ఒక దశలో ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చిందని ఆమె తెలిపారు. అయితే తన పిల్లల కోసం, న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు."నేను వెనక్కి తగ్గేది లేదు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను. సుప్రీంకోర్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది." అని ఆమె స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+