డీఆర్డీవో స్మార్ట్ మిసైల్ సక్సెస్: బాలాసోర్ నుంచి ప్రయోగం.. నేవీ సేవల కోసం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (డీఆర్డీవో) స్మార్ట్ మిస్సైల్‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఒడిశాలోని బాల‌సోర్ టెస్ట్ రేంజ్ నుంచి మిస్సైల్ ప‌రీక్ష నిర్వ‌హించింది. సూప‌ర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెట్ రిలీజ్ ఆఫ్ టార్పెడో (స్మార్ట్) సూదూర ల‌క్ష్యాల‌ను విజ‌య‌వంతంగా ఛేదించ‌గ‌ల‌దు. యాంటీ స‌బ్‌మెరైన్ వార్‌ఫేర్ సామ‌ర్థ్యాన్ని సాంప్ర‌దాయ ప‌రిధి కంటే మ‌రింత విస్త‌రించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా స్మార్ట్ మిస్సైల్ వ్య‌వ‌స్థను డిజైన్ చేసిన‌ట్లు డీఆర్‌డీవో తెలిపింది. స్మార్ట్ మిస్సైల్ ప‌రీక్ష‌కు సంబంధించిన వీడియోను ప్రయోగం అనంతరం డీఆర్డీవో విడుద‌ల చేసింది.

యాంటీ స‌బ్‌మెరైన్ వార్‌ఫేర్ సామ‌ర్థ్యాన్ని సాంప్ర‌దాయ ప‌రిధి కంటే మ‌రింత విస్త‌రించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా స్మార్ట్ మిసైల్ వ్య‌వ‌స్థను డిజైన్ చేసిన‌ట్లు డీఆర్‌డీవో తెలిపింది. ఇదీ నెక్ట్స్ జనరేసన్ మిసైల్ అని వివరించింది. పరీక్షలో మిసైల్ పూర్తి స్థాయి, శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిందని పేర్కొంది. నీటిపై నుంచి దీనిని ప్రయోగించొచ్చు అని చెప్పింది.

DRDO successfully tests long-range Supersonic Missile Assisted Release of Torpedo

కచ్చితమైన లక్ష్యాన్ని కూడా మిసైల్ చేధించగలరు. ఇదీ భారత నౌకాదళానికి అందించనుంది. దక్షిణ చైనా సముంద్రంలో పట్టు కోసం పావులు కదుపుతోన్న డ్రాగన్‌కు కళ్లెం వేసేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. అయితే సూపర్ సోనిక్ మిసైల్ టెస్ట్ విజయవంతం కావడం భారత్‌కు కలిసొచ్చే అంశమని రక్షణ శాఖ వర్గాలు అంటున్నాయి. ఇదీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ మిసైల్ అని.. వివరించాయి.

ఆధునాతన క్షిపణి వ్యవస్థ కోసం డీఆర్డీవో వివిధ సాంకేతికతను డెవలప్ చేశాయి. ఇదివరకు డీఆర్డీవో శాంట్ మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్మార్ట్ ప్రయోగించారు. ఇటీవల కాలంలో మూడో సారి వరసగా డీఆర్డీవో క్షిపణిని ప్రయోగించింది. లాంగ్ రేంజ్ బాంబ్ అండ్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ (ఎస్ఏఏడబ్య్లా) ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇదీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఉద్దేశించినది అనే సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+