వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పసికందు ప్రాణం కొట్టుమిట్టాడుతోంది, సాయంకోసం ఎదురుచూపు

Google Oneindia TeluguNews

అంజి, మంగమ్మలు అందరు తల్లిదండ్రుల్లాగానే తమ ఇంట్లోకి మహాతల్లి అడుగుపెట్టిందని తమ పాపాయిని చూసి మురిసిపోయారు. వారి చిట్టితల్లి మే 30, 2018న జన్మించింది. ఆ ముద్దులొలికే పసిపిల్లను చూసి వారి ఆనందానికి అవధులే లేవు. అయితే, ఇంతలోనే వారిని ఒక సమస్య వచ్చింది. వీరి పాప ఏడునెలలకే జన్మించింది. అంటే ప్రీమెచ్యూర్ బేబీ అన్నమాట. అప్పటి నుంచి ఆ పాప శ్వాసకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతూ వస్తోంది. వెంటిలేటర్ ద్వారా శ్వాసను అందిస్తున్నారు.

దీంతో మంగమ్మ అంజీలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆ పాపాయిని కనీసం వారు సంతృప్తిగా ఎత్తుకున్నదీ లేదు. ఆ పసిపాప పుట్టినప్పటి నుంచి నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో చికిత్స తీసుకుంటోంది. ట్యూబ్స్ అలాగే వైర్స్ మధ్యన బ్యాండేజెస్ తో ఉన్న ఆ పసిపాపను చూసిన వారి కళ్లనుంచి కన్నీళ్లు వస్తాయి. తినలేకపోతోంది. అలాగే శ్వాసను తీసుకోలేకపోతోంది.

Drivers premature baby girl waits for treatment in NICU

ఆ పసిపాప ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలంటే మరికొన్నాళ్ళు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అవసరమని డాక్టర్లు ఆ దంపతులకు సూచించారు. ఆ చిట్టితల్లి కాస్త ఆరోగ్యంగా మారాలంటే మరికొన్నాళ్లు చికిత్స అవసరమని సూచించారు. కానీ ఆ బీద దంపతులు ఆ పాప చికిత్స కోసం అవసరమైన డబ్బును సమకూర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు.

దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈ దంపతులకు పూట గడవడమే కష్టంగా ఉన్న సమయంలో వారి చిట్టితల్లి ఇటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉండటం వారిని మరింతగా వేధిస్తోంది. డ్రైవర్‍‌గా పనిచేస్తున్న అంజి నెల జీతం రూ.10,000. ఈ జీతంతోనే వృద్ధులైన తన తల్లిదండ్రులని అలాగే తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ జీతంతో నెలంతా గడవడం కష్టంగా ఉన్న తరుణంలో ఇటువంటి ఎమర్జెన్సీలకు అతను సొమ్మును జమ చేయలేకపోలేకపోతున్నాడు.

Drivers premature baby girl waits for treatment in NICU

ఇప్పుడు, వారి పాప ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో ఉంది. ఇప్పటికే, బంధుమిత్రుల నుంచి ఇప్పటికే అంజి మంగమ్మలు దాదాపు 3 లక్షల రూపాయలను తీసుకున్నారు. వీటితో, ఇప్పటి వరకూ చికిత్స చేయించగలిగారు. అయితే, ఆ పసికందు కోలుకోవడానికి అవసరమయ్యే చికిత్సకు దాదాపు 8 లక్షల రూపాయలు అవసరపడతాయి. చికిత్సకయ్యే ఖర్చును పెట్టుకునే స్థితిలో అంజి దంపతులు లేరు. అందువల్ల వారు మెడికల్ క్రౌడ్ ఫండింగ్‌ను ప్రారంభించారు.

అంజి మంగమ్మల పసిపాప కోసం ఫండ్ రైజర్ ఇప్పుడు డొనేషన్స్‌ను స్వీకరిస్తోంది. దేవుడు మనుషుల రూపంలో ఉంటాడని నమ్ముతున్న వీరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వీరికి దాతలు సహాయం చేస్తారని వీరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వీరి నమ్మకం గెలుస్తుందని ఆశిద్దాం. పాపను ప్రాణాలతో బతికించుకోవాలని కోరుకుందాం.

పాపకు సాయం చేయాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X