'పాక్‌పై అణుబాంబు వేయండి, మోడీ ఏం చేయట్లేదు'

సరిహద్దుల్లో పాకిస్తాన్ ఎన్నోసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోందని, అలాంటి పాక్ పైన ఒక్క అణుబాంబా వేయాలని విశ్వహిందూ పరిషత్ నేత ఆచార్య ధర్మేంద్ర.

లక్నో: సరిహద్దుల్లో పాకిస్తాన్ ఎన్నోసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోందని, అలాంటి పాక్ పైన ఒక్క అణుబాంబా వేయాలని విశ్వహిందూ పరిషత్ నేత ఆచార్య ధర్మేంద్ర సూచించారు.

అణుబాంబు వేయండి

అణుబాంబు వేయండి

కాల్పుల విరమణ ఒప్పందానికి నిత్యమూ తూట్లు పొడుస్తూ, భారత పోస్టులపై దాడులు చేస్తున్న దాయాది పైన ఓ అణుబాంబు వేయాలన్నారు. భారత ఉపఖండంలో శాంతి నెలకొనాలంటే, పాక్ పైన అణుబాంబు వేసి వారిని కోలుకోలేని దెబ్బతీయడం ఒక్కటే మార్గమన్నారు.

పాకిస్తాన్ మనకు శత్రు దేశం

పాకిస్తాన్ మనకు శత్రు దేశం

రాజస్థాన్‌లోని కోటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాకిస్థాన్ పొరుగు దేశం కాదని, అది మన దేశానికి శత్రు దేశమని ధర్మేంద్ర అభివర్ణించారు.

మహాత్మా గాంధీయే కారణం

మహాత్మా గాంధీయే కారణం

భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఈ వివాదానికి జాతిపితగా భారతీయులు కొలుచుకునే మహాత్మా గాంధీ కారణమని ధర్మేంద్ర ఆరోపించారు. అసలు దేశ కరెన్సీ మీద ఆయన చిత్రాలను ఎందుకని ప్రశ్నించారు.

నరేంద్ర మోడీపై విమర్శలు

నరేంద్ర మోడీపై విమర్శలు

గోవును జాతీయ మాతగా ప్రకటించాలని ధర్మేంద్ర డిమాండ్ చేశారు. ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వం టాయిలెట్లు కట్టించడంపై మాత్రమే దృష్టిని సారించిందని ఆచార్య ధర్మేంద్ర విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+