జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీలక ప్రసంగం
77వ రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన యోధులకు నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాతలు నిబంధనల ద్వారా జాతీయ స్ఫూర్తికి, దేశ ఐక్యతకు బలమైన పునాదిని వేశారని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. సోమవారం(జనవరి 26) భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో ద్రౌపది ముర్ము ఆదివారం జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
జనవరి 26, రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టినట్లు ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పంటలకు విత్తనాలు, మద్దతు ధర, బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.
రాజకీయాల్లోకి వచ్చే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోందని స్పష్టం చేశారు. ఇటీవల బీర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాలల సంఖ్య క్రమంగా పెరిగినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఈ మేరకు జనవరి 26 న భారత్.. 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో ద్రౌపదీ ముర్ము ఆదివారం జాతినుద్దేశించి కీలక ప్రసంగం నిర్వహించారు.

మరోవైపు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అలాగే ఈ వేడుక సందర్భంగా 2,500 మందికిపైగా కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అలాగే మేడ్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, డిజిటల్ పేమెంట్స్, వ్యాక్సిన్స్ ప్రొడక్షన్, యూపీఐ వంటి అంశాలు రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రాధాన్యం కానున్నాయి.












Click it and Unblock the Notifications