వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ్ మాల్యాపై కేసు నమోదు: 515 కోట్లు తీసుకొవద్దు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కింగ్‌ఫిషర్ బ్రాండ్‌తో భారతీయ వ్యాపార దిగ్గజంగా నీరాజనాలు అందుకున్న విజయ్ మాల్యా ఎయిర్ లైన్స్ రంగంలో ప్రవేశించిన తర్వాత అర్ధిక సమస్యల్లో చిక్కుకున్నారు. భారత్‌లో ఇక లాభం లేదని, తన వ్యాపార సామ్రాజ్యాన్ని డియోజియాకి అమ్మేసి లండన్‌లో స్థిరపడదామని అనుకున్న సమయంలో ఆర్థికలావాదేవీల కేసులు ఆయన్ని వెంటాడుతున్నాయి.

వివరాల్లోకి వెళితే... కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ ఛైర్మన్‌ విజయ్‌మాల్యాకు డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. సీబీఐ ఫిర్యాదు మేరకు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు.

విజయ్ మాల్యా, ఐడీబీఐ అధికారులు కలిసి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.900 కోట్లు నష్టం కలిగించడానికి కారణమయ్యారని సీబీఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. నెగెటివ్ క్రిడిట్ రేటింగ్స్, ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోకుండా కింగ్‌ఫిషర్‌కు ఐడీబీఐ రుణాలిచ్చిందని ఆరోపించింది.

DRT orders Diageo not to disburse Rs 500 crore to Vijay Mallya

అంతేకాదు ముంబైకు చెందిన ఐడీబీఐ బ్యాంకు అధికారులపైనా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే విజయ్ మాల్యాను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు డియాజియో నుంచి అందుకోనున్న రూ.515 కోట్లు ఖాతా నుంచి తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది.

తదుపరి విచారణను ఈనెల 28కి వేస్తున్నట్లు డెట్‌ రికవరీ ట్రైబున్యల్‌ స్పష్టం చేసింది. కాగా, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ 2012 అక్టోబర్ నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. తానెక్కడికి పారిపోలేదని, రుణ ఎగవేతదారును కాదని విజయ్ మాల్యా స్పష్టం చేయడం గమనార్హం.

English summary
The Debt Recovery Tribunal at Bengaluru an interim order on Monday, March 7 ruled that Diageo cannot disburse 75 million US dollars or Rs 500 crore to Vijay Mallya. While hearing a batch of petitions on Monday, March 7 the DRT ruled that the money shall not be disbursed until the disposal of the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X