doctors: డ్రగ్స్ సేవించి మస్త్ మజా చేసిన శంకర్ దాదా ఎంబీబీఎస్ లు, 8 మంది ఔట్, ఫినిష్ !
బెంగళూరు/మంగళూరు: కర్ణాటకలోని మంగళూరు సిటీలో డాక్టర్ల డ్రగ్స్ నెట్‌వర్క్ కేసులో పట్టుబడిన ఇద్దరు వైద్యులు, ఏడుగురు వైద్య విద్యార్థులను కేఎంసీ ఆస్పత్రి యాజమాన్యం సస్పెండ్ చేసింది.
అత్తావర్ కేఎంసీ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సమీర్, మెడికల్ సర్జన్ డాక్టర్ మణిమారన్ ముత్తు డ్రగ్స్ దందాలో సస్పెండ్ అయ్యారు. వీరితో సహ 8 మంది వైద్య విద్యార్థులను కాలేజ్ ను బహిష్కరించడం హాట్ టాపిక్ అయ్యింది.

అదేవిధంగా డాక్టర్ కిషోరి లాల్, డాక్టర్ నదియా సిరాజ్, డాక్టర్ వర్షిణి పత్రి, డాక్టర్ రియా చద్దా, డాక్టర్ ఇరా బసిన, డాక్టర్ క్షితిజ్ గుప్తా, డాక్టర్ హర్ష కుమార్ వి.ఎస్. వీరంతా సస్పెండ్‌కు గురైన వైద్య విద్యార్థులు. మంగళూరులోని ప్రముఖ వైద్య కళాశాలల వైద్యులు, వైద్య విద్యార్థులు గంజాయి సేవించడమే కాకుండా గంజాయి విక్రయించడం కర్ణాటక వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఇప్పుడు కేఎంసీ ఆస్పత్రి యాజమాన్య బోర్డు ఇద్దరు వైద్యులను తొలగించి వారి కాంట్రాక్టును రద్దు చేసింది. అదేవిధంగా వైద్య విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు ఆస్పత్రి నుంచి సస్పెండ్ చేశారు. మంగళూరు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన కేఎంసీ డీన్ ఉన్నికృష్ణన్ వైద్యులు, వైద్య విద్యార్థులపై తీసుకున్న కఠిన చర్యల గురించి పోలీసు కమీనర్ కు వివరించారు.
దీనిపై మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్. శివకుమార్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన డాక్టర్లు, వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశామని కేఎంసీ డీన్ చెప్పారని సిటీ పోలీసు కమీషనర్ శశికుమార్ మీడియాకు చెప్పారు. మేము డీన్ తీసుకున్న కఠిన చర్యలను అభినందిస్తున్నామని అన్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత మందిని అరెస్టు చేశాం. ఆసుపత్రి ఆవరణలో ఇలాంటి డ్రగ్స్ వ్యాపారం జరగడం సిగ్గుచేటు అని సిటీ పోలీసు కమీషనర్ శశికుమార్ విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications