బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. 40 లక్షలకు ఐటీ రిటన్స్: అడ్డంగా బుక్కయ్యాడు: గంజాయి, విల్లాకు రూ. 40 వేలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: గంజాయి విక్రయిస్తూ రూ. కోట్ల రూపాయలు సంపాధిస్తూ తాను కాంట్రాక్టర్ గా కష్టపడి డబ్బు సంపాధించానని ఆదాయపన్ను చెల్లించిన ఓ వ్యక్తిని బెంగళూరులోని కోరమంగల పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. విల్లాలో నివాసం ఉంటూ నెలకు రూ. 40 వేలు అద్దె చెల్లిస్తూ ఒక్క సారిగా భారీ మొత్తంలో ఆదాయపన్ను చెల్లించిన వ్యక్తి మీద పోలీసులు నిఘా వెయ్యడంతో ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది.

నెలకు రూ. 40వేలు అద్దె !

నెలకు రూ. 40వేలు అద్దె !

కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర జిల్లా పుష్పాపుర ప్రాంతానికి చెందిన రాచప్ప రంగ (34) బెంగళూరు నగరానికి 12 ఏళ్ల క్రితం వలస వచ్చాడు. కనకపుర రోడ్డులోని విల్లాలో రాచప్ప నివాసం ఉంటున్నాడు. ఇతను నివాసం ఉండే విల్లాకు ప్రతినెల రూ. 40 వేలు అద్దె చెల్లిస్తున్నాడు.

ఏడాదికి రూ. 40 లక్షలు

ఏడాదికి రూ. 40 లక్షలు

తాను క్లాస్ 1 కాంట్రాక్టర్ గా పని చేస్తున్నానని, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 40 లక్షలు ఆధాయం వచ్చిందని ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులకు పన్ను చెల్లించాడు. ఒక్క సారిగా రాచప్ప భారీ మొత్తంలో ఆదాయపన్ను చెల్లించడంతో ఐటీ శాఖ అధికారులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అసిస్టెంట్

అసిస్టెంట్


బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని చందాపురకు చెందిన శ్రీనివాస్ (47) అనే వ్యక్తి సహాయంతో రాచప్ప కోరమంగల పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నాడు. 2013 వరకూ ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో కూలి పని చేసిన రాచప్ప ఒక్క సారిగా శ్రీమంతుడి అవతారం ఎత్తాడని పోలీసులు గుర్తించారు.

లగ్జరీ కారు

లగ్జరీ కారు

రాచప్ప విలాసవంతమైన కారు ఉపయోగిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. కోరమంగల 80 అడుగుల రోడ్డులో విలాసవంతమైన కారులో రాచప్ప, శ్రీనివాస్ వెలుతున్న సమయంలో పోలీసులు అడ్డగించారు. కారులో పరిశీలించగా 26 కేజీల గంజాయి, 5 లక్షల రూపాయల నగదు బయటపడటంతో వెంటనే పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కారు, గంజాయి, నగదు సీజ్ చేశారు.

గంజాయి కేజీ రూ. 35 వేలు

గంజాయి కేజీ రూ. 35 వేలు

కాలేజ్ విద్యార్థులు, శ్రీమంతుల పిల్లలు, టెక్కీలను టార్గెట్ చేసుకుని రాచప్ప, శ్రీనివాస్ గంజాయి విక్రయిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నెలకు 30 కేజీలకు పైగా గంజాయి విక్రయిస్తున్నారని, ఒక్క కేజీ గంజాయి రూ. 35,000కు (టాప్ క్వాలిటీ) విక్రయిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

రూ. కోట్లలో ఆస్తి

రూ. కోట్లలో ఆస్తి

ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా గంజాయి విక్రయిస్తున్న రాచప్ప నెలకు రూ. 10 లక్షలకుపైగా సంపాధిస్తున్నాడని, సొంత గ్రామంలో భూములు, పోలాలు కొనుగోలు చేశాడని, విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. భారీ మొత్తంలో ఆదాయపన్ను చెల్లించడం వలనే రాచప్ప చిక్కిపోయాడని పోలీసులు తెలిపారు.

English summary
A 34-year-old migrant construction labourer who declared Rs 40 lakh as his annual income and filed his income-tax returns was arrested for peddling drugs in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X