సబ్బుల మాటున హెరాయిన్: ఇద్దరు కిలాడీలు అరెస్ట్!!
భారతదేశంలో డ్రగ్స్ అక్రమ రవాణా చాపకింద నీరులా విస్తరిస్తోంది. డిఆర్ఐ, నార్కోటిక్స్ అధికారులు, ఎయిర్ పోర్ట్ లలో కస్టమ్స్ అధికారులు ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతున్నా డ్రగ్స్ దందా సాగుతూనే ఉంది. నిత్యం ఎక్కడో ఒక చోట డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతున్న ముఠాలు పెరిగిపోయాయి.
తాజాగా సబ్బుల మాటున డ్రగ్స్ రవాణా చేస్తున్న మిజోరంకు చెందిన ఇద్దరు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 306 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్ విలువ ఒకకోటి 53 లక్షల రూపాయలు ఉంటుందని అస్సాం రైఫిల్స్ కు చెందిన అధికారులు వెల్లడించారు. అస్సాం రైఫిల్స్ మరియు ఐజ్వాల్ లోని స్పెషల్ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఇద్దరు యువతులను పట్టుకున్నారు.

వీరు డ్రగ్స్ ను ఎక్కడికి రవాణా చేస్తున్నారు? ఎక్కడినుంచి తీసుకువస్తున్నారు? అనేది దర్యాప్తు చేస్తున్న అధికారులు ఈ డ్రగ్స్ రవాణా మాఫియా గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు తరచు డ్రోన్స్ ద్వారా డ్రగ్స్ ను మన దేశంలోకి పంపిస్తున్నట్టు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుర్తించింది.
భారతదేశంలోని యువతను డ్రగ్స్ కు బానిసలుగా చెయ్యడానికి ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. మరొకవైపు అంతర్జాతీయ మాఫియా కూడా దేశంలో డ్రగ్స్ దందా జోరుగా కొనసాగిస్తుంది. ఇటీవల కాలంలో ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ముంబై జోనల్ యూనిట్ అధికారులు ఒక ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్న 2.58 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
దీని విలువ సుమారు 25 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇథియోపియా అడిస్ అబాబా నుండి వచ్చిన వ్యక్తి ట్రాలీ బ్యాగ్ లో 12 సబ్బులను అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేసిన డిఆర్ఐ అధికారులు అందులో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. అతనిని అరెస్టు చేసి డ్రగ్స్ దందా పై దర్యాప్తు చేశారు. ఇలా సబ్బుల్లో డ్రగ్స్ దందా సాగుతుంది. తాజాగా ఇద్దరు యువతులు పట్టుబడిన కేసులో కూడా వారు సబ్బు కేసుల్లో డ్రగ్స్ పెట్టి తరలిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications