అందమైన ఆంటీలు, అమ్మాయిలు టార్గెట్, డ్రమ్స్ వాయిస్తూ ఏం చేశాడంటే !
జైపూర్/రాజస్థాన్: ఓ యుువకుడు డ్రమ్స్ వాయిస్తున్నాడు. వివాహాలు, శుభకార్యాలకు, పార్టీలకు, వింధులు ఏర్పాటు చేస్తున్న వారు ఆ యువకుడి టీమ్ ను కచేరీలకు పిలుస్తున్నారు. ఇలా పలు ప్రాంతాలు తిరుగుతున్న ఆ యువకుడు మాస్టర్ ప్లాన్ వేశాడు. అందమైన ఆంటీలు, వయసుకు వస్తున్న అమాయకులైన అమ్మాయిలను టార్గెట్ చేసుకున్నాడు. మనోడి లిస్ట్ లో ఇప్పటికే 40 మంది వివాహిత మహిళలు, అమ్మాయిలు చేరిపోయారు. తరువాత కేటుగాడు అసలు కథ మొదలుపెట్టాడు.
అశ్లీలంగా ఉన్న అమ్మాయిలు, వివాహిత మహిళల ఫోటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన యువకుడిని రాజస్థాన్ పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని బర్మార్‌కు చెందిన ముఖేష్ కుమార్ అనే యువకుడిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడి మొబైల్ ఫోన్ లో, అతని పెన్ డ్రైవ్ లో మొత్తం అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నాయని పోలీసులు అన్నారు.

ముఖేష్ కుమార్ డ్రమ్ వాయించే కలాకాడుడు. వివాహాలతో సహా ఫంక్షన్లలో కచేరీలు నిర్వహించే వ్యాపారంలో ముఖేష్ నిమగ్నం అయ్యాడు. తన చుట్టుపక్కల గ్రామాల్లో పండుగలకు. శుభకార్యాలకు వెళ్లినప్పుడు యువతులతో, ముఖ్యంగా మైనర్లు, వివాహిత మహిళలతో ముఖేష్ పరిచయం పెంచుకున్నాడు, డ్రమ్స్ బాగా వాయిస్తున్న ముఖేష్ తో స్నేహం చెయ్యడానికి కొందరు అమ్మాయిలు, వివాహిత మహిళలు ఆసక్తి చూపించారు.
ఇదే సమయంలో ముఖేష్ అమ్మాయిలు, ఆంటీల సెల్ ఫోన్ నంబర్లు ఇప్పించుకున్నాడు. ముఖేష్ చాటింగ్ ద్వారా, వారితో నేరుగా ఫోన్ లలో మాట్లాడటం మొదలుపెట్టాడు. రానురాను ముఖేష్ అమ్మాయిలు, ఆంటీలను రెచ్చగొట్టి వారితో వీడియో కాల్‌లో మాట్లాడే వరకు కథ నడిపించాడు. కొందరు అమ్మాయిలు, వివాహిత మహిళలు అశ్లీలంగా, అర్దనగ్నంగా ఉన్న సమయంలో ముఖేష్ తో మాట్లాడారు. ఆ సమయంలో మొబైల్ స్క్రీన్ రికార్డర్‌ని ఉపయోగించిన ముఖేష్ అమ్మాయిలు, ఆంటీల అశ్లీల వీడియో కాల్ ను సీక్రేట్ గా అతని సెల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు.
అనంతరం మహిళలు, బాలికల ఫొటోలు, వీడియోలను అసభ్యకర చిత్రాలతో ఇంటర్నెట్‌లో వ్యాప్తి చేశాడు. అలాగే బాధిత మహిళలు, బాలికలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చెయ్యడం మొదలుపెట్టాడు. ఇలా చుట్టుపక్కల 6 గ్రామాల్లో 40 మందికి పైగా వివాహిత మహిళలు, బాలికలపై ముఖేష్ అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడు.
గత రెండు నెలలుగా చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన అమ్మాయిలు వివాహిత మహిళల అశ్లీల చిత్రాలు, ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఎవరు ఇలా చేసి ఉంటారని వివాహిత మహిళలు, అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆరా తీశారు. అయితే ముఖేష్ కు పరిచయం ఉన్న అమ్మాయిలు, ఆంటీల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని మీద అందరికి అనుమానం వచ్చింది.

ఇటీవల ఓ బాధితురాలు ధైర్యంగా ముఖేష్ మీద సామ్‌దారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ముఖేష్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఖేష్ మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్ లో మొత్తం అశ్లీల చిత్రాలు, ఫోటోలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. దీంతో పోలీసులు ముఖేష్ కుమార్‌పై పోక్సో తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపించారు. ముఖేష్ వేధింపులు తాళలేక ఓ బాలిక, ఆమె తల్లి ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications