ఆంధ్రా, కర్ణాటక ప్రజలకు బ్యాడ్ న్యూస్, దీపావళికి బ్యాన్ చేసిన అధికారులు, చూపులు మాత్రమే !
పర్యాటక ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రజలు, పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ధర్మపురి జిల్లా యంత్రాంగం హోగెనకల్ కావేరీ నదిలో పడవ నడపడాన్ని, పడవలో ప్రయాణించడాన్ని నిషేధించారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోలోని హోగెనకల్ కావేరీ నదిలో సెకనుకు 8, 000 క్యూబిక్ అడుగుల కంటే ఎక్కువ నీటి ప్రవాహం ఉంది.
భద్రతా కారణాల దృష్ట్యా జిల్లా యంత్రాంగం సాధారణంగా పరిసర ప్రాంతాల్లో సంచరించడం నిషేధిస్తుంది. అధికారుల నివేదిక ప్రకారం హోగెనకల్ లో కావేరీ నది సెకనుకు 11,000 క్యూబిక్ అడుగుల ప్రవహిస్తోంది. ధర్మపురి జిల్లా యంత్రాంగం హోగెనకల్ కావేరీ నదిలో బోటింగ్ సేవలను నిషేధించింది. అయితే హోగెనకల్ జలపాతంలో స్నానాలు చేసేందుకు పర్యాటకులకు మరియు ప్రజలకు ఎటువంటి ఆంక్షలు లేవని అధికారులు తెలిపారు.

తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని కావేరి పరివాహక ప్రాంతాలు, అటవీ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కావేరి నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను అలర్ట్ చేశారు. దీపావళి సెలవుల్లో హొగెనకల్‌కు ఇంకా ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తారని అధికారులు భావిస్తున్నారు.
ముందు జాగ్రత్త చర్యగా హోగనకల్ జలాశయంలో, కావేరి నది ప్రవహించే ప్రాంతాల్లో బోటు ప్రయాణాన్ని పూర్తిగా నిషేధించామని, ఎవరైన నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. హోగనకల్ వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాల్లో ధర్మపురి జిల్లా అధికారులు, పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు.

ఇప్పుడు కర్ణాటక వదులుతున్న కావేరీ నీరు కూడా ఇదే హోగనకల్ నుంచి వెలుతుండటంతో వాటర్ ఫాల్స్ లో నీటి ప్రవహాం ఎక్కువగా ఉంది. ప్రతినిత్యం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి హోగనకల్ వాటర్ ఫాల్స్ చూడటానికి, అక్కడ పడవలో ప్రయాణిస్తూ ఎంజాయ్ చెయ్యడానికి వేలాది మంది పర్యాటకు వెలుతుంటారు. హోగనకల్ వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాల్లో నిత్యం తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి.












Click it and Unblock the Notifications