'హనీమూన్ సమయంలో మేం మంటల్లో తగలబడుతున్న ఇంట్లో, బొద్దింకల మధ్య గడిపాం

చాలా మంది తమ హనీమూన్‌ను ఒక అందమైన ప్రదేశంలో రొమాంటిక్‌గా జరుపుకుంటారు. కానీ 'ఓహ్ వండర్' జంట మాత్రం అలా జరుపుకోలేదు.
బ్యాండ్‌గా ఏర్పడినప్పటి నుంచి జంటగానే ఉన్న ఈ ఇండీ పాప్ ద్వయం హనీమూన్ సమయంలో ఇంగ్లండ్‌లోని ఇప్స్‌విచ్‌కు వెళ్లి బ్రేకప్ గురించి ఒక షార్ట్ ఫిల్మ్ నిర్మించింది.
పూర్తి సంతోషంతో రోజును మొదలుపెట్టి, చివరికి బొద్దింకలతో నిండిన పాడుబడిన ఇంటిలోకి వెళ్లాల్సి వచ్చిందని గాయకుడు, రచయిత ఆంటోనీ వెస్ట్ చెప్పారు.
ఆ తర్వాతి వారమంతా తాము వాదించుకోవడంతోనే సరిపోయిందని ఆయన జోడి జోసెఫిన్ వాండర్ గుచ్ట్ (జోసీ) అన్నారు.
ఆ తర్వాత ఈ కథ మరింత దారుణంగా మారింది. కథలో జోసీకి హైపోథెర్మియా వచ్చింది. దాంతో తగలబడుతున్న ఇంట్లోకి ఆంటోనీ పరిగెత్తాల్సి వచ్చింది. ఆ ఇంట్లో వాళ్ల ముఖాలపై నుంచి తేళ్లు పారాయి.
కానీ వీళ్లు అక్కడికి ఎలా చేరారో తెలుసుకోవాలంటే కరోనా రాకముందు కాలానికి మనం వెళ్లాలి.
- 'నేను కేవలం ప్రధానమంత్రిని, ఆమె సంగీత ప్రపంచ మహారాణి’
- హైదరాబాద్: మా అబ్బాయి సంగీతంతో ఆటిజాన్ని జయించాడు

ఈ బ్యాండ్ 2020 మార్చిలో తమ జీవితంలోనే అతిపెద్ద టూర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. నాలుగు ఖండాల్లో ప్రదర్శనలకు తేదీలు ఖరారు చేసుకున్నారు. కానీ యాత్రకు ఐదు రోజుల ముందు అకస్మాత్తుగా దీన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
మేము రెండు నెలల పాటు రిహార్సల్స్ చేశాం. కానీ టూర్ రద్దు కావడంతో ఏం చేయాలో అర్థం కాలేదని ఆంటోనీ చెప్పారు.
గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఒక బ్యాండ్‌కు ఒక్కసారిగా ఇలా బ్రేకులు వేసి ఆపితే సహజంగా ఊపిరి ఆడనంత పనవుతుంది.
2014 నుంచి వీళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. పనిచేసే విధానమే వీళ్లకు మంచిపేరు తీసుకొచ్చింది.
సౌండ్‌క్లౌడ్‌లో వీళ్లు నెలకొక పాట విడుదల చేసేవాళ్లు. ఆ తర్వాత వాటి ప్రమోషన్ కోసం విస్తృతంగా పర్యటించే వాళ్లు.
మంచి మనిషిగా ఉండాలంటే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కష్టపడాలని మా తల్లిదండ్రులు చెప్పేవారు. అదే మాకు అలవాటైందని జోసీ చెప్పారు.
లాక్‌డౌన్ కారణంగా మొదట్లో కొత్త పాటలు రాసేందుకు మాకు అవకాశం దొరికింది. జూన్‌లోగా 'హోం టేప్స్'కు సరిపడినన్ని పాటలు సిద్ధమయ్యాయి. క్వారంటైన్‌లో ఐసోలేషన్ గురించి 'హోం టేప్స్' ఆల్బమ్ తీశారు.
ఆ తర్వాత ఆంటోనీ వంట చేస్తుంటే, తాను తింటూ ఉన్నానని జోసీ చెప్పారు.
కానీ చాలా మంది జంటల మాదిరిగానే లాక్‌డౌన్ వీళ్ల రిలేషన్‌షిప్‌పై ప్రభావం చూపింది. వేసవిలో కూడా వీళ్లు పాటలు రాయడం కొనసాగించారు. కానీ ఆ పాటల సాహిత్యంలో కోపం, ఆగ్రహం కనిపించాయి. అది వారిని కూడా ఆశ్చర్యపరిచింది.
మేము స్టూడియోలోకి వెళ్తాం. అప్పుడు ఈ విద్వేషపూరిత సాహిత్యం బయటకు వస్తుండేదని జోసీ చెప్పారు. దాని గురించి మేము పెద్దగా చర్చించలేదు. తల ఊపి పాట పూర్తి చేసేశాం అన్నారు.
స్టూడియో వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. వారి రిలేషన్‌షిప్ ప్రమాదంలో పడుతోందన్న విషయం వారిద్దరికీ అర్థమైంది. చేస్తున్న నాలుగో ఆల్బమే చివరిది కావొచ్చని వాళ్లు అనుకున్నారు.
https://www.youtube.com/watch?v=3MEc3YjDWzY
లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితం కావడంతో వీళ్లు తమ భావాలను ఆల్బమ్, డాక్యుమెంటరీలో వ్యక్తపరిచారు. తమ వ్యక్తిగత, వృత్తిపరమైన రిలేషన్‌షిప్ ముగియబోతోందని వాళ్లు అనుకున్నారు.
ఆ తర్వాత పాటల రూపంలో ఇద్దరూ క్షమాపణలు చెప్పుకున్నారు. క్రమంగా వారిద్దరి సంబంధాలు మెరుగుపడ్డాయి.
లాక్‌డౌన్ సమయంలో చాలామంది తమ ఫీలింగ్స్‌ను పాతిపెట్టారు. అలా మా ఫీలింగ్స్‌ను పాతిపెట్టడం మాకిష్టం లేదు. అందుకే తాము పాటలు రాశామని జోసీ చెప్పారు.
ఆ రోజుల్లోకి వెళ్లి చూస్తే.. ఒక్కోసారి మేమిద్దరం వాదించుకునేవాళ్లం. గొడవ పడేవాళ్లం. కానీ ఆ మర్నాడు మేమిద్దరం స్టూడియోలోకి వెళ్లి యథావిథిగా పనిచేసేవాళ్లం. ఇప్పుడు ఆలోచిస్తుంటే అదంతా చిత్రంగా అనిపిస్తోంది. మేము మాట్లాడుకోలేదనిపిస్తుంది. కానీ నిజానికి మేము చాలా ఎక్కువగా మాట్లాడుకున్నామని ఆమె తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ప్రతి దాని గురించి చర్చించడానికి తమకు ఇదే చివరి మార్గమని ఆంటోనీ చెప్పారు. మా మధ్య పాటల్లోనే శాంతి కుదిరేదని ఆయన వివరించారు.
https://www.youtube.com/watch?v=ehl4-a7ImlA
ఆ రికార్డింగ్ పూర్తయ్యేనాటికి వాళ్ల రిలేషన్‌షిప్ కూడా మెరుగుపడింది.
అది కచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్‌లా అనిపించింది. ఒక చిన్న ఆశ చిగురించిందని ఆంటోనీ అన్నారు. మేము చీకటిని అధిగమించి మరోవైపు నుంచి బయటపడ్డామని ఆయన అభివర్ణించారు.
'22 బ్రేక్' అనే ఆల్బమ్ నిజానికి గతేడాది అక్టోబర్ కల్లా పూర్తి కావాల్సి ఉండేది. కానీ యూకేలో కోవిడ్ తగ్గలేదని, తొందరపడొద్దని బ్యాండ్ మేనేజర్ వారికి సూచించారు.
క్రిస్మస్‌లోగా ఆల్బమ్ విడుదల చేయాలనుకున్నామని ఆంటోనీ చెప్పారు.
కానీ మీరు కొన్ని నెలలు సరదాగా గడిపితే బావుంటుంది. పాటలతో విసుగు చెందకండి. సంగీతంపై ప్రేమను కోల్పోకండి. కొన్నిరోజులు ఏదైనా వేరే పని చేయండి. లేదంటే మీరు కోపంగా, బాధపడుతూ ఉంటారు. మీరేదో చేశారు. ఇక దాన్ని మీరు మార్చలేరు అని బ్యాండ్ మేనేజర్ చెప్పారని జోసీ వివరించారు.
దాని గురించి ఆలోచించినప్పుడు అది తెలివైన పనేనని నాకనిపించిందని ఆమె అన్నారు.
- మైకేల్ జాక్సన్ లెగసీ మసకబారిందా? అతడి సంగీతం మూగబోతుందా?
- 'ఆయన నా గదిలోకి వచ్చి నాపై అత్యాచారం చేశారు... నేను మూడు రోజుల వరకు గదిలోనే ఉండిపోయాను’

రిలేషన్‌షిప్‌లో ఎదురైన సమస్యల నుంచి గట్టెక్కిన వెంటనే చాలా జంటలు చేసే పనే వీళ్లు కూడా చేశారు. ఒక కాఫీ షాపు కొన్నారు.
నాకు ఎప్పటి నుంచో ఒక కాఫీ షాపు కొనాలని ఉండేది. కానీ సమయం దొరకలేదని ఆంటోనీ చెప్పారు.
మేము ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కాఫీ షాపులకు వెళ్లాం. మాకు ఆ అనుభవం ఉంది. దాన్ని మా సొంత కాఫీ షాపులో అమల్లో పెట్టకపోవడం పాపం అవుతుందని ఆంటోనీ వివరించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఈ పాప్ బ్యాండ్ తమ ఆల్బమ్ విడుదల కావడానికి ముందు అంటే గతేడాది చివరి మూడు నెలలు లండన్‌లోని పిక్‌హామ్ ప్రజలకు కాఫీలు అందించింది. కానీ వీరిని ఎవరూ గుర్తుపట్టలేదు.
మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టలేదు. మేము మాస్కులు పెట్టుకున్నాం. ఫ్లోర్ తుడిచాం. కాఫీలు అందించాం. జనంతో మాట్లాడుతూ పని చేయడం చాలా బాగా అనిపించిందని జోసీ తెలిపారు.
అంతేకాదు రోజుకు 600 కాఫీలు తయారు చేస్తే ఫోమ్ ఆర్ట్ మీకు చాలా బాగా వస్తుందని ఆంటోనీ అన్నారు.

వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ జంట సిబ్బందిని నియమించుకుని కాఫీ షాపు బాధ్యతలు వాళ్లకు అప్పగించింది. ఆ తర్వాత రికార్డింగ్ పనులపై దృష్టి పెట్టింది.
ఇందులో రెండు అంశాలున్నాయి. 1. సంగీతంతో పాటు ఒక షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించడం 2. మ్యారేజ్ ప్రతిపాదన.
మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని తమకు ముందు నుంచి తెలుసని జోసీ చెప్పారు. ఇప్పుడు పెళ్లి చేసుకోకుంటే ఇంకెప్పుడు చేసుకోలేమని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత మేము ప్రపంచ యాత్ర తిరిగి చేపట్టబోతున్నామని ఆమె తెలిపారు.
దాంతో ఆగస్టులో స్నేహితులు, తోటి సంగీతకారుల సమక్షంలో ఈ జంట పెళ్లి చేసుకుంది. వీళ్ల స్నేహితులు 'ఓహ్ వండర్'లా డ్రెస్ వేసుకుని, వీళ్ల సొంత పాటలతో ప్రదర్శన ఇచ్చారు.
అది తన జీవితంలో మర్చిపోలేని రోజని జోసీ చెప్పారు.
- ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి చేరడం వల్ల ఎలాంటి మార్పులు రావచ్చు?
- అస్సాంలో ముస్లిం యువకుడి హత్యపై ఓఐసీ ప్రకటన.. ఇస్లామిక్ దేశాల జోక్యంపై భారత్ ఏమందంటే..

ఇక ఈ కథ మొదటి భాగానికి తిరిగి వెళ్తే.. వివాహమైన రెండు రోజుల తర్వాతే వీళ్లు 'బ్రేకప్' షార్ట్ ఫిల్మ్ ఎందుకు చిత్రీకరించాల్సి వచ్చింది?
నిజానికి దాన్ని మా పెళ్లికి ముందే తీయాలని అనుకున్నాం. కానీ డైరెక్టర్‌కు అప్పుడు కోవిడ్ వచ్చిందని జోసీ వివరించారు.
తన జీవితంలో అత్యంత కఠినమైన వారాల్లో అదొకటని ఆమె అన్నారు.
షార్ట్ ఫిల్మ్‌లో చాలా భాగం మేము ఆ పాడుబడిన ఇంట్లోనే చిత్రీకరించాం. కానీ అక్కడ ఎవరో ఉంటున్నారని తొమ్మిది రోజుల తర్వాత మాకు తెలిసింది. వాళ్లు ఏదో ఒక గదిలో దాక్కున్నారని అనిపించిందని ఆనాటి ఘటనలను జోసీ గుర్తు చేసుకున్నారు.
జోసీ సముద్రంలోకి వెళ్లే మరో సెట్ వేశారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెకు హైపోథెర్మియా వస్తుంది. దాంతో ఆమెకు ఒక అంబులెన్స్‌లో చికిత్స చేయించాల్సి వస్తుంది.
మిగతా సన్నివేశాల్లో పురుగులు, సీతాకోకచిలుకలు, క్రిమికీటకాలుగా నటించేందుకు మ్యూజిషియన్స్ అవసరం ఏర్పడింది.
అయితే, ఒక సన్నివేశం కోసం ఆంటోనీ తన ప్రాణాలను పణంగా పెట్టారు. పాడుబడిన ఇంటికి నిప్పుపెట్టిన సన్నివేశంలో ఆయన నటించారు.
- యూపీ: 'రైతుల్ని కారుతో గుద్ది చంపిన కేసు’లో కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్
- 'వృద్ధాప్యం ఒక వ్యాధి, దాన్ని నయం చేయవచ్చు' -హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్

మా దగ్గర పైరోటెక్నిక్ నిపుణులు ఉన్నారు. సరిగ్గా అలాంటి పాడుపడిన ఇంటిని తయారు చేసివ్వడం వాళ్ల బాధ్యతని ఆంటోనీ చెప్పారు.
ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేయబోతున్నామంటూ చిత్ర బృందంలోని ఒకరు ఒక నైలాన్ కర్టెన్‌కు నిప్పుపెట్టారు. కొద్దిసేపట్లోనే ఆ సెట్ అంతటా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక పరికరం తీసుకురండని ప్రతిఒక్కరు అరుస్తున్నారు. కానీ అది మేము వ్యాన్‌లోనే వదిలేసి వచ్చామని ఆంటోనీ వివరించారు.
అప్పుడు మనం షూటింగ్ చేయాలి. అక్కడికి వెళ్లండి. మనం చిత్రీకరణ మొదలుపెడదామని డైరెక్టర్ చెప్పారు.
తన భర్త మంటలతో పోరాడుతున్న సన్నివేశం చూసిన జోసీ తనలో తానే ఇలా అనుకుంది.
నేను ఇంట్లో కూర్చొని పాటలు రాయాలి. నాకు హైపోథెర్మియా వచ్చింది. నువ్వేమో తగలబడుతున్న భవనంలో ఉన్నావు. అసలు ఇలా తీయాలని మనం ఎలా అనుకున్నామంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది.
అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఓహ్ వండర్ జంట నవంబర్‌లో హనీమూన్ బుక్ చేసుకుంది.
దానికంటే ముందు తమ రిలేషన్‌షిప్ దాదాపు పతనమయ్యే దశకు చేరుకున్న విషయాన్ని వీళ్లు '22 బ్రేక్' ఆల్బమ్ రూపంలో అభిమానులతో పంచుకున్నారు. గతంతో పోలిస్తే ఇది వాళ్ల గురించి మరిన్ని వివరాలను బయటపెట్టేదిగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- మంచు విష్ణు: 'తెలుగులో నాకు మార్కులు తక్కువ రావచ్చు. కానీ, క్యారెక్టర్ విషయంలో మాత్రం..’
- చైనాలో తైవాన్ శాంతియుతంగా కలవాల్సిందేనన్న షీ జిన్‌పింగ్ -BBC Newsreel
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- హెటిరో ఫార్మా సంస్థలో ఐటీ సోదాలు, రూ. 142 కోట్ల నగదు స్వాధీనం
- పాకిస్తాన్లో భూకంపం, స్పెయిన్‌లో బద్దలైన అగ్నిపర్వతం... ఈ వారం విశేషాల ఫోటో ఫీచర్
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)