నేపాల్‌లో భూకంపం.. ఢిల్లీ, యూపీలో ప్రకంపనలు
పొరుగు దేశం నేపాల్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం నేపాల్‌లో 5.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. నేపాల్‌లో సంభవించిన భూకంపం ప్రభావంతో హిమాలయాలను ఆనుకుని ఉన్న రాష్ట్రాలు, ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
శుక్రవారం రాత్రి 7.52 నిమిషాలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 20 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. నేపాల్‌లో సంభవించిన భూకంపంతో మనదేశంలోని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయ. అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో 2.6 తీవ్రతతో భూకంపం నమోదైన ఒకరోజు తర్వాత నేపాల్‌లో భూకంపం సంభవించింది. మార్చి 28న మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే.
EQ of M: 5.0, On: 04/04/2025 19:52:53 IST, Lat: 28.83 N, Long: 82.06 E, Depth: 20 Km, Location: Nepal.
— National Center for Seismology (@NCS_Earthquake) April 4, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/DxUFnxRvc7
మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా 3 వేలకుపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 5 వేల మంది వరకు గాయపడ్డారు. మరో 341 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. థాయ్‌లాండ్‌లో భూకంపం కారణంగా 30 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.












Click it and Unblock the Notifications