జమ్మూకాశ్మీర్‌లో భూకంపం: పరుగులు తీసిన జనం
జమ్మూకాశ్మీర్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. స్వల్ప భూకంపమే అయినప్పటికీ దీని తీవ్రతకు ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించిపోయింది.ఆందోళనకు గురైన ప్రజ
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. స్వల్ప భూకంపమే అయినప్పటికీ దీని తీవ్రతకు ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించిపోయింది.
ఆందోళనకు గురైన ప్రజలు ఇళ్లు, ఆఫీసులు, దుకాణాల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలియరాలేదు. తరచూ భూకంపాలు చోటుచేసుకునే జోన్‌లో జమ్మూకాశ్మీర్ ప్రాంతం ఉన్న విషయం తెలిసిందే.

పాక్ కాల్పులు: 727 మంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో తుపాకులు గర్జిస్తున్నాయి. జమ్ము, సాంబా జిల్లాల్లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంట భారత్ భూభాగంలోకి శుక్రవారం పాక్ సైనికులు గుళ్ల వర్షం కురిపించారు. దీంతో 727 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
గురువారం కూడా పాక్ సైనికులు సరిహద్దుల్లోని భారత సైనిక పోస్టుల లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వారంలో దాదాపు ప్రతి రోజు పాక్ సైనికులు వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంట నిరంతరంగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉన్నారని భారత సైనిక వర్గాలు తెలిపాయి. ఈ కాల్పులను తాము సమర్థంగా తిప్పికొడుతున్నట్లు వెల్లడించాయి.
కాగా, జమ్మూకాశ్మీర్‌లోని బనిహల్ ప్రాంతంలో బుధవారం ఎస్‌ఎస్‌బీ జవాన్లపై కాల్పులు జరిపి ఒకరి మృతికి, మరొకరు గాయపడటానికి కారణమైన గజ్నాఫర్, ఆరిఫ్ అనే ఈ ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications