మహారాష్ట్రలోని సతారాలో నగరంలో భూకంపం
ముంబై: మహారాష్ట్రలోన సతారా నగరంలో శుక్రవారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంపం 3.4గా నమోదైంది. ఈ చిన్నపాటి భూకంపం శుక్రవారం ఉదయం 7.11 గంటలకు చోటు చేసుకుంది.
ప్రకంపనల గురించి ప్రజలు సోషల్ మీడియాలో సమాచారం ఇస్తూ వెళ్లారు. జనవరి 31వ తేదీన ఢిల్లీలోనూ ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లోనూ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.

ఢిల్లీలో వచ్చిన భూకంపం తీవ్ర స్థాయిలో ఉండి ప్రజలను భయకంపితులను చేసింది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చి తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఆ భూకంపం పాకిస్తాన్‌ను కూడా తాకింది. పాకిస్తాన్‌లో కొంత విధ్వంసం కూడా చోటు చేసుకుంది. హింద్ కుష్ ప్రాంతంలో ఓ వ్యక్తి మరణించినట్లు, పలువురు గాయపడినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications