Earthquake: వణికిన ఈశాన్య రాష్ట్రాలు: అస్సాం సహా పలు చోట్ల ప్రకంపనలు.. !
న్యూఢిల్లీ: అస్సాంలో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. ఈ భూకంప తీవ్రతకు అస్సాం సహా మేఘాలయ, మిజోరం, పశ్చిమ బెంగాల్ ఉత్తరాది ప్రాంతాలు వణికిపోయాయి. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటిదాకా ఎలాంటి వార్తలు కూడా అందలేదు. కొన్ని ప్రాంతాల్లో నివాసాలు, ఇతర భవనాలు బీటలు వారినట్లు తెలుస్తోంది.

ఈ సాయంత్రం 6:17 నిమిషాల సమయంలో భూకంపం సంభవించింది. కొన్ని సెకెన్ల పాటు భూమి కంపించింది. మేఘాలయలోని తుర ప్రాంతానికి ఈశాన్య దిశగా 100 కిలోమీటర్లు, అస్సాంలోని బొంగైగావ్ జిల్లా అభయాపురికి 16 కిలోమీటర్ల దూరంలోని పర్వత ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూ ఉపరితలం నుంచి కనీసం 10 కిలోమీటర్ల లోతున చోటు చేసుకున్న ఫలకాల మార్పుల వల్ల భూకంపం సంభవించినట్లు జాతీయ సెస్మాలజీ కేంద్రం వెల్లడించింది.
భూమి అంతర్భాగంలో చోటు చేసుకోవడం వల్ల ఉపరితలంపై దాని తీవ్రత స్థాయి తగ్గిందని పేర్కొంది. అయినప్పటికీ.. 5.0 తీవ్రతతో భూకంపం నమోదు కావడం ప్రమాదకరంగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గౌహతి, షిల్లాంగ్, తురా, జల్‌పాయ్ గురి, కూచ్ బెహార్, అలీపూర్ దౌర్ వంటి ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వాటిని గుర్తించిన వెంటనే ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. తమ నివాసాలు, కార్యాలయాల నుంచి బహిరంగ ప్రదేశాలకు పరుగులు తీశారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications