తెల్లవారు జామున రెండు రాష్ట్రాలను వణికించిన భూకంపం
ఈ తెల్లవారు జామున వరుస భూకంపాలు సంభవించాయి. ఈశాన్య రాష్ట్రాలను వణికించాయి. ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణనష్టంగానీ నమోదు కాలేదు. కొన్ని చోట్ల పాక్షికంగా భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం అందింది. భూకంపం ధాటికి స్థానికులు ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదు కావడంతో ఇళ్లల్లోనికి వెళ్లడానికి భయపడ్డారు.
అస్సాం, త్రిపురల్లో ఈ తెల్లవారు జామున జంట భూకంపాలు సంభవించాయి. అస్సాం మోరిగావ్‌లో ఈ తెల్లవారు జామున 5:15 నిమిషాలకు భూమి ప్రకోపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.1గా రికార్డయింది. 26.37 ఉత్తర అక్షాంశం, 92.29 తూర్పు రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఉపరితలం నుంచి 50 కిలోమీటర్లు దిగువన టెక్టానిక్ ప్లేట్లల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూకంపం సంభవించింది.

అంతకుముందు ఈ వేకువ జామున 3:33 నిమిషాల సమయంలో త్రిపురలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.9 గా రికార్డయింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.1గా రికార్డయింది. 23.67 ఉత్తర అక్షాంశం, 91.50 తూర్పు రేఖాంశం వద్ద గల గోమతీ జిల్లా అమర్ పూర్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు సెస్మాలజీ సెంటర్ తెలిపింది. ఉపరితలం నుంచి 54 కిలోమీటర్లు దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు వివరించింది.
దీనివల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు గానీ కొన్ని చోట్ల ఇళ్లు బీటలు వారాయి. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం ఉంది. అంతకు రెండు రోజుల ముందు- పశ్చిమ నేపాల్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 10:51 నిమిషాలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. ఉదయ్‌పూర్ జిల్లాలోని బాగపటి ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.












Click it and Unblock the Notifications