జైలు ఆహారం తినండి: మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అభ్యర్థనపై కోర్టు, 14 రోజుల రిమాండ్
ముంబై: మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఇంటి నుంచి ఆహారం, ఔషధాలను అనుమతించాలని అనిల్ దేశ్‌ముఖ్ తరపున న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, వారి అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
అంతేగాక, ముందు కొన్ని రోజులపాటు జైలు ఆహారం తినండి. జైలు ఆహారంపై ఏదైనా ఫిర్యాదు ఉంటే మా దృష్టికి తీసుకురండి. అప్పుడు మీ విజ్ఞప్తిని పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది. వయసురీత్యా నేలపై పడుకోలేనని, అందుకు బెడ్‌కు అనుమతి ఇవ్వాలని అనిల్ దేశ్ ముఖ్ తరపు న్యాయవాది కోరగా.. అందుకు మాత్రం కోర్టు అంగీకరించింది.

ఈ మాజీ మంత్రికి జైలు వైద్యుల కన్సల్టేషన్‌తో సంబంధిత మెడిసన్ సమకూర్చాలని (పీఎంఎల్ఏ) కోర్టు అదేశించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం.. 12 గంటలపాటు ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నవంబర్ 1న దేశ్‌ముఖ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈడీ రిమాండ్‌కో కోర్టు పంపగా, ఆ రిమాండ్‌ను పొడిగించాలంటూ ఈడీ చేసుకున్న విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు నవంబర్ 7న తోసిపుచ్చింది. అనంతరం ఆయన్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. తదుపరి రోజు దిగువ కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను ముంబై హైకోర్టు తోసిపుచ్చుతూ.. నవంబర్ 12 వరకూ ఈడీ రిమాండ్‌కు దేశ్‌ముఖ్‌ను పంపింది.
Recommended Video
అనిల్ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో అతన్ని కోర్టులో హాజరు పర్చగా.. కోర్టు జ్యూడిషియల్ కస్టడికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, అవినీతి, అధికారిక పదవి దుర్వినియోగం ఆరోపణలపై ఈ ఏడాది ఏప్రిల్ 21న ఎన్‌సీపీ నేత, హోంమంత్రి అనిల్, అతని అనుచరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. అనంతరం ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అనిల్ దేశ్‌ముఖ్... రూ.100 కోట్ల లంచం తీసుకున్నారంటూ.. ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణల అనంతరం ఆయనపై మనీలాండరింగ్ కేసును నమోదైంది.












Click it and Unblock the Notifications